వామ్మో..పొట్ట నిండా చెంచాలు..టూత్‌ బ్రష్‌లే..

Updated on: Sep 28, 2025 | 12:40 PM

సాధారణంగా ఎవరికైనా కోసం వస్తే.. ఆ కోపం అంతా పక్కనున్నవాళ్లపై చూపిస్తారు.. వారిపై గట్టిగా అరుస్తారు.. మహిళలైతే ఇంట్లోని గిన్నెలు విసిరేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి.. విచిత్రంగా తన కోపాన్ని ప్రదర్శించడానికి ఏకంగా స్టీలు స్పూన్లు, టూత్‌ బ్రష్‌లు, పెన్నులు తినేశాడు. దీంతో అవి అతని పొట్టనిండా పేరుకుపోయాయి. క్రమంగా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించగా అతని పొట్టలోని స్టీలు గుట్టను చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు.

ఇన్ని స్టీల్ చెంచాలు కడుపులోకి ఎలా వెళ్లాయని అక్కడున్న ఆసుపత్రి సిబ్బంది అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా బులంద్‌షెహర్‌కు చెందిన 40 ఏళ్ల సచిన్ మత్తుకు బానిసైపోయాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు సచిన్‌ను డీఎడిక్షన్ సెంటర్‌లో చేర్పించారు. దీంతో.. తనను ఒంటరిగా అక్కడ వదిలేసి వెళ్లారని ఇంట్లో వాళ్ల మీద సచిన్ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో వారి మీద కోపంతో.. స్టీల్ చెంచాలు, టూత్ బ్రష్‌లు, పెన్నులు తినడం మొదలుపెట్టాడు. ఎవరైనా కోపం వస్తే గట్టిగట్టిగా అరుస్తారు.. లేదంటే పక్క వాళ్ళ మీద చూపిస్తారు. ఇదేంటి ఈయన ఇలా స్టీల్ వస్తువులు తినేస్తున్నాడని అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో అతని ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. దాంతో అతడిని హాపూర్‌లోని దేవనందిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుడు డా.శ్యామ్ కుమార్ ఎక్స్‌రే తీసి చూడగా కడుపులో భారీగా మెటల్ వస్తువులు కనిపించాయి. వాటిని చూసి షాక్‌ తిన్న వైద్య బృందం వెంటనే శస్త్రచికిత్స చేసి అతని కడుపులో నుంచి 29 స్టీల్ చెంచాలు, 19 టూత్ బ్రష్‌లు, 2 పెన్‌లు బయటకు తీశారు. ఈ ఘటనపై డా.శ్యామ్ కుమార్ మాట్లాడుతూ.. ‘రోగిని అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతను డ్రగ్ ఎడిక్షన్ సెంటర్‌లో చెంచాలు, టూత్ బ్రష్‌లు తినేవాడని చెప్పారు. శస్త్రచికిత్స తర్వాత మొత్తం వస్తువులు బయటకు తీశాం. మానసిక సమస్యలున్నవారిలో ఈ లక్షణం కనిపిస్తుంది. ప్రస్తుతం అతను ఆరోగ్యంగా ఉండటంతో డిశ్చార్జ్‌ చేశాం’ అని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణ హైకోర్టులో OG టికెట్ రేట్లపై వాదనలు

Jal Prahar-25: కాకినాడ తీరంలో జల్ ప్రహార్ 2025 విన్యాసాలు

మిగ్ 21 యుద్ధ విమానాలకు తుది వీడ్కోలు

ఒక్క ఉత్తరంతో దుర్మార్గుల నోరు మూయించినందుకు చిరంజీవికి అభినందనలు

టిక్కెట్ల పెంపు అనేది OG సమస్య కాదు.. ఇండస్ట్రీ సమస్య