వామ్మో! టన్ను బరువున్న గుమ్మడికాయ ఎలా పండించారంటే
సాధారణంగా గుమ్మడికాయలు మూడు, నాలుగు కిలోల బరువు ఉంటాయి. మహా అయితే కొన్ని గుమ్మడికాయలు 10 కిలోల బరువు తూగుతాయి. అత్యంత అరుదుగా కొన్ని గుమ్మడి కాయలు సుమారుగా 20 కిలోల వరకు బరువు పెరగవచ్చు. కానీ ఆ రైతు పండించిన గుమ్మడికాయ మాత్రం ఏకంగా 969 కిలోల బరువు ఉంది. అతిపెద్ద గుమ్మడికాయను పండించిన రైతుగా అతను రికార్డు సృష్టించాడు.
రష్యాకు చెందిన అలెగ్జాండర్ చుసోవ్ అనే రైతు అతిపెద్ద గుమ్మడికాయను పండించి రికార్డు నెలకొల్పాడు. మాస్కోలో జరిగిన భారీ కూరగాయల పోటీల్లో ఆ భారీ గుమ్మడికాయను ప్రదర్శించారు. దాని బరువు ఏకంగా 969 కిలోలు ఉంది. దాంతో అది రష్యాలోనే అతిపెద్ద గుమ్మడికాయగా రికార్డుల్లోకి ఎక్కింది. ఆ భారీ గుమ్మడి కాయను పండించేందుకు ఆరు నెలల కంటే ఎక్కువ సమయం పట్టిందని రైతు చుసోవ్ తెలిపారు. నేల, గాలిని వేడి చేసే ప్రత్యేక గ్రీన్ హౌస్‌ను నిర్మించి అందులో జాగ్రత్తగా దీన్ని పండించినట్లు చెప్పారు. ఎరువులు, నీటిని కచ్చితమైన మోతాదులో అందించినట్లు వివరించారు. ఈ పోటీల్లో దాదాపు మూడు వేల మందికిపైగా రైతులు పాల్గొన్నారు. పోటీల్లో 144 కేజీల బరువున్న పుచ్చకాయ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఆట్రోవర్ట్’ లక్షణాలు మీలో ఉన్నాయా? అలాంటి వారే ఇలా ఉంటారట..!
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

