పాముల హనీమూన్ స్పాట్ చూసారా.. ప్రపంచంలో కెల్లా వింత

Updated on: Apr 21, 2025 | 4:26 PM

ఈ ప్రపంచంలో వింతలు విశేషాలు ఎన్నో. ప్రకృతి పరంగా జరిగే అద్భుతాలకు కొదవే లేదు. ప్రతి ఏడాది వసంతకాలంలో కెనడాలోని నార్సిస్‌ స్నేక్‌ డెన్స్‌లో ఓ వింత జరుగుతుంది. అక్కడ వేలాది పాములు గుమిగూడతాయి. ఈ ప్రాంతానికి 75 వేల కంటే ఎక్కువ పాములు వస్తాయని అంటారు. ఆ విశేషాలపై వివరంగా ఓ లుక్‌ వేద్దాం.

అంతకంటే ముందు.. ఈ పాముల ప్రపంచం చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఈ కోల్డ్ బ్లడెడ్‌ సరీసృపాలు చాలా భయానకంగా ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పాము కింగ్ కోబ్రా. దాని విషం మనిషి క్షణాల్లో చనిపోయేంత ప్రమాదకరంగా ఉంటుంది. ఈ పామును దూరం నుండి చూస్తేనే చెమటతో తడిసిముద్దవుతాం. అయితే కింగ్ కోబ్రాలు దట్టమైన అడవులలో నివసిస్తాయి. అక్కడ మనుషుల రాకపోకలు చాలా అరుదు. అందుకే వాటితో కాటుకు గురైన సందర్భాలు అరుదు. దీని 0.1 ఎం.ఎల్‌. విషం చాలు! ఈ అతి కొద్ది పరిమాణంలో ఉన్న విషం ఏనుగును సైతం చంపేయగలదు. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. కొన్ని పాముల్లో ప్రత్యేక ప్రవర్తనను చూడొచ్చు. అలాంటి లక్షణాలలో ఒఫియోఫాగి ఒకటి. అంటే ఇతర పాముల్ని తినడం. ఈ లక్షణం కొన్ని పాము జాతులలో ఉంటుంది. సొంత జాతి పాములతో పాటు ఇతర విష సర్పాలను వేటాడి వెంటాడి తింటాయి. కింగ్ కోబ్రాలో సైతం ఈ స్వభావం ఉంటుంది. ఈ పాములు సరదా కోసం ఇతర పాముల్ని తినవు. కొన్నిసార్లు ఆహారం కొరత ఉన్నప్పుడు, లేదంటే తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు మాత్రమే ఇతర పాముల మీద దాడి చేసి వాటిని చంపి తింటాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చావుకు ముందు ఏం జరుగుతుంది ?? మరణాన్ని ఆపేందుకు మెదడు పోరాడుతుందా ??