Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ లక్షణాలతో కడుపుబ్బరమా? అయితే జాగ్రత్త వీడియో

ఈ లక్షణాలతో కడుపుబ్బరమా? అయితే జాగ్రత్త వీడియో

Samatha J

|

Updated on: Jun 08, 2025 | 3:24 PM

ప్రస్తుత రోజుల్లో చాలా మందికి పొట్టలో ఉబ్బరం, నొప్పి, గ్యాస్ బాధలు పెరుగుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వీటి విషయంలో అజాగ్రత్తగా ఉంటే కొన్నిసార్లు తీవ్ర ఆరోగ్య సమస్యలు ప్రాణాపాయానికి దారితీయవచ్చు అంటున్నారు నిపుణులు కాబట్టి ఈ సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. మారిన ఆహారపు అలవాట్లు అస్తవ్యస్తమైన జీవన శైలి వీటికి ప్రధాన కారణం అంటున్నారు వైద్య నిపుణులు. అందులో ముఖ్యంగా టైంకు ఆహారం తినకపోవడం, వేగంగా తినడం, కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి అంటున్నారు.

కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఉప్పు, కారం, మసాలా పదార్థాలు అధికంగా తీసుకోవడం, అతిగా ఆందోళన, ఒత్తిడికి గురవడం ఇవన్నీ కూడా పొట్టలో గ్యాస్ బాధలను పెంచుతాయి అని చెబుతున్నారు. కొందరికి గ్యాస్ ఉత్పత్తి ఎక్కువగానే ఉంటుంది. అది తినే ఫుడ్ వల్ల కావచ్చు లేదా పొట్టలో ఇన్ఫెక్షన్ల వల్ల కావచ్చు. ముఖ్యంగా క్యాబేజ్, కాలిఫ్లవర్, బీన్స్, కొన్నిసార్లు క్యారెట్లు, పప్పులు, పాలు, పాల ఉత్పత్తులు, కృత్రిమ స్వీటెనర్ల వల్ల కూడా పొట్టలో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. అలాంటి టైంలో ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామం ద్వారా గ్యాస్ సమస్యలను కొంత వరకు తగ్గించుకోవచ్చు. అయితే కొందరిలో ఈ బాధ ఎక్కువగా ఉంటుంది.