UK Couple: కాలం కలిసిరావడమంటే ఇదేనేమో.. దెబ్బకు దంపతుల దశ తిరిగిందిగా.. షాక్ ల మీద షాక్ లు..

|

Sep 07, 2022 | 8:54 AM

ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అనేది ఓ నానుడి.. నిజంగానే ఒక ఐడియా.. కాదు ఆలోచన వారి జీవితాన్నే మార్చేసింది. దెబ్బకు దశతిరిగి దరిద్రం వదిలి కోటిశ్వరులైపోయారు. కాలం కలిసిరావడమంటే ఇదేనేమో..


ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అనేది ఓ నానుడి.. నిజంగానే ఒక ఐడియా.. కాదు ఆలోచన వారి జీవితాన్నే మార్చేసింది. దెబ్బకు దశతిరిగి దరిద్రం వదిలి కోటిశ్వరులైపోయారు. కాలం కలిసిరావడమంటే ఇదేనేమో.. ఇల్లు పాతబడిపోవడంతో.. దానికి రిపేర్లు చేయించి, కొత్త ఇంటిగా మార్చుకోవాలనుకున్నారు ఓ జంట. కానీ వాళ్లకేం తెలుసు ఆ ఇంటికింద బంగారు నిధి ఉందని.. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది.యూకేకు చెందిన ఓ జంట తమ పాత ఇల్లు రినొవేట్ చేసే క్రమంలో వంట గదిలో తవ్వుతుండగా వాళ్లకు ఒక పెట్టె దొరికింది. దానిలో నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి 264 బంగారు నాణేలు దొరికాయి. వాటి ధర ఎంత కాదనుకున్నా 2.3 కోట్లు పలుకుతుందని అంచనా. యూకేకు చెందిన ఈ జంట అదే ఇంట్లో దాదాపు పదేళ్లుగా ఉంటోంది. ఇవి 18వ శతాబ్దం నాటివని తెలిసిన సదరు జంట వాటిని వేలంపాటలో అమ్మాలని నిర్ణయించుకుంది. ఎల్లర్బీ గ్రామంలోని ఈ ఇంట్లో దొరికిన ఈ నాణేలు.. బ్రిటన్‌ను జేమ్స్-I, చార్లెస్-I పరిపాలించిన సమయం నాటివని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ నాణేలన్నీ కూడా 1610 నుంచి 1727 మధ్య కాలం నాటివని ఆ జంట గుర్తించింది. ఆ కాలానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబం ఈ సొమ్మును దాచుకొని ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. కాగా వీటిని 2.5 లక్షల పౌండ్లు అంటే సుమారు 2.3 కోట్ల కు అమ్మేందుకు ఈ జంట సిద్ధమైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 07, 2022 08:54 AM