తుని ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం.. యువకుడి కాలులో అది పెట్టేసి కుట్టేసారు..
తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒక యువకుడి కాలి ఆపరేషన్‌లో వైద్యులు సర్జికల్ బ్లేడ్‌ను మర్చిపోయి కుట్లు వేశారు. స్కానింగ్‌లో గుర్తించిన బాధితుడు మళ్లీ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన ప్రభుత్వ ఆసుపత్రులలో రోగుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఓ యువకుడి కాలికి ఆపరేషన్ చేసిన వైద్యులు.. సర్జికల్ బ్లేడ్ మర్చిపోయి కుట్లు వేశారు. తుని మండలం ఎస్.అన్నవరం పంచాయతీ పరిధిలోని రామకృష్ణా నగర్‌కు చెందిన చిన్నా.. ఏడాదిన్నర క్రితం వైజాగ్‌లో కాలి గాయానికి ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పట్లో కాలికి బలంగా దెబ్బతగలడంతో కాలు లోపలి భాగంలో రాడ్ అమర్చి ఆపరేషన్ చేశారు. ఏడాదిన్నర గడిచిన తర్వాత వెలుపల ఉన్న ఒక బోల్ట్ తీస్తే త్వరగా సెట్ అవుతుందని చెప్పడంతో..కాలులో రాడ్‌కు ఉన్న బోల్ట్ తీయించుకునేందుకు తుని గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్లాడు. తుని గవర్నమెంట్ హాస్పిటల్‌లోని వైద్యులు, సిబ్బంది ఆపరేషన్ చేసి రాడ్ బోల్ట్‌ను తీశారు. ఈ క్రమంలో కాలులో సర్జికల్ బ్లేడు కాలులో మరిచిపోయి యధావిధిగా కుట్లు వేశారు. ఆ విషయాన్ని స్కానింగ్‌లో గుర్తించాడు సదరు బాధితుడు ఆందోళన చెంది, మళ్లీ వైద్యులను సంప్రదించాడు. దీంతో మరోసారి ఆపరేషన్ చేసి ఆ బ్లేడును తొలగించారు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఇదేం పని అని వైద్యులను ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల తీరుకు జనం ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాఫీలు తాగారా? టిఫినీలు చేశారా? పెళ్లిలో యువతుల హడావుడి.. చివరికి
ఊరెళ్లేటప్పుడు ఇల్లే.. ఇంటికి వచ్చేసరికి కోళ్ల ఫారం అయ్యింది.. అదే కదా మ్యాజిక్కు..
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీనితో మీ సామాన్లు భద్రం
ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ పని ఇంటినుంచే చేయచ్చు
