పంజాబ్ లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ !! నెట్టింట వైరల్ గా మారిన వీడియో

|

May 29, 2024 | 1:13 PM

ప్రపంచ ప్రఖ్యాత కట్టడం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడాలని ఉందా? అయితే దీని కోసం మీరు విమానం ఎక్కి న్యూయార్క్ సిటీ వరకు వెళ్లాల్సిన పనిలేదు! జస్ట్ మన దేశంలోని పంజాబ్ వెళ్తే చాలు.. మీరు విన్నది నిజమే.. విగ్రహం అమెరికాలో ఉంటే పంజాబ్‌ వెళ్లమంటారేంటనేగా మీ అనుమానం. అవును, పంజాబ్ లోని తర్న్ తరణ్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నమూనా అందరినీ ఆకర్షిస్తోంది.

ప్రపంచ ప్రఖ్యాత కట్టడం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడాలని ఉందా? అయితే దీని కోసం మీరు విమానం ఎక్కి న్యూయార్క్ సిటీ వరకు వెళ్లాల్సిన పనిలేదు! జస్ట్ మన దేశంలోని పంజాబ్ వెళ్తే చాలు.. మీరు విన్నది నిజమే.. విగ్రహం అమెరికాలో ఉంటే పంజాబ్‌ వెళ్లమంటారేంటనేగా మీ అనుమానం. అవును, పంజాబ్ లోని తర్న్ తరణ్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నమూనా అందరినీ ఆకర్షిస్తోంది. దీన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. విగ్రహాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నమూనా విగ్రహాన్ని క్రేన్ సాయంతో కొందరు వ్యక్తులు భవనంపై ఏర్పాటు చేయడం ఆ వీడియోలో కనిపించింది. అలోక్ జైన్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతలో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. పంజాబ్ లోని ఏదో ప్రాంతంలో మూడో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం అంటూ ఆ వీడియో కింద క్యాప్షన్ పెట్టారు. దీన్ని చూసిన నెటిజన్లంతా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఓ యూజర్ స్పందిస్తూ ‘అది మంచినీళ్ల ట్యాంకు అయ్యుంటుంది. పంజాబ్ లో చాలా మంది ఇళ్లపై మంచి నీళ్ల ట్యాంకులు విమానాలు, ఎస్ యూవీల ఆకారంలోనే కనిపిస్తాయి అని పేర్కొన్నాడు. మరొకరేమో ‘నయాగారా ఫాల్స్ ను నిర్మించాల్సింది.. అప్పుడు కెనడాను మిస్ అయ్యే వాళ్లం కాదు’ అంటూ చమత్కరించాడు. గ్రామీణ పంజాబ్ లో ప్రజలు నీళ్ల ట్యాంకులను ఫుట్ బాల్, మత చిహ్నాలు, వాహనాల ఆకారంలో ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే 3 లక్షలమందికి పైగా వీక్షించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salaar: ఈ విషయం తెలిస్తే.. మీరు నవ్వకుండా ఉండలేరు

చిన్న వాదన.. ఆ స్టార్ నటుడి ప్రాణం బలితీసుకుంది

‘ఎవరో ఎక్కడికో వెళితే నాకేంటి సంబంధం’ మంచు లక్ష్మి సీరియస్

డ్రైవర్ మాట నమ్మి.. రూ.వందల కోట్లు నష్టపోయిన హీరో

Hema: అందర్నీ ఫిదా చేస్తోన్న.. హేమ గ్రేట్ లవ్‌ స్టోరీ

Follow us on