ఈ చెట్లు మీ ఇంట్లో పెంచారో.. అంతే వీడియో
చెట్లు పర్యావరణానికి మంచివే అయినా, ఇంట్లో పెంచకూడని కొన్ని మొక్కలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖర్జూరం, రేగు, జిల్లేడు, రావి, చింత వంటి చెట్లు ఇంటి ఆవరణలో ప్రతికూల శక్తిని ఆకర్షించి ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, అనారోగ్యాలకు దారితీస్తాయంటున్నారు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.
చెట్లు పెంచడం పర్యావరణానికి ఎంతో మంచిది. చాలామందికి కనిపించిన ప్రతి మొక్కనూ తెచ్చి ఇంటి ఆవరణలో పెంచుకోవడం అలవాటుగా ఉంటుంది. అయితే, కొన్ని మొక్కలను ఇంటి ఆవరణలో నాటడం శ్రేయస్కరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. అవి ప్రతికూల శక్తిని ఆకర్షించి ఇంట్లో సమస్యలను సృష్టిస్తాయని వారు చెబుతున్నారు. ఖర్జూర చెట్టు చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నా, ఇంటి ఆవరణలో నాటడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, సంపద నష్టం కలుగుతాయని నిపుణులు అంటున్నారు. దీని ఎత్తు, ఆకారం ఇంటి సానుకూల శక్తిని అడ్డుకోవచ్చు. అలాగే, రేగు చెట్టు కూడా ఇంట్లో పెంచకూడనిదే. దీని ముళ్లు ప్రతికూల శక్తికి చిహ్నమని, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, ఆర్థిక నష్టం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
