Late train welcome: లేటుగా వచ్చిన రైలు.. విసిగిపోయిన ప్రయాణికులు ఏం చేశారంటే.. వైరల్‌ వీడియో

|

Dec 04, 2022 | 9:58 AM

రైలు ప్రయాణికులు తాము ప్రయాణించే రైలు ఎక్కడ మిస్‌ అవుతామో అని కాస్త ముందుగానే స్టేషన్‌కు చేరుకుని ఎదురుచూస్తుంటారు. అయితే ఒక్కోసారి రైలు రావడం కాస్త ఆలస్యం అవుతుంది. అది ఏ గంటో..


రైలు ప్రయాణికులు తాము ప్రయాణించే రైలు ఎక్కడ మిస్‌ అవుతామో అని కాస్త ముందుగానే స్టేషన్‌కు చేరుకుని ఎదురుచూస్తుంటారు. అయితే ఒక్కోసారి రైలు రావడం కాస్త ఆలస్యం అవుతుంది. అది ఏ గంటో… అరగంటలో అయితే పర్వాలేదు.. కానీ ఏకంగా 9 గంటలు రైలు కోసం ఎదురు చూడాలంటే ఆ ప్రయాణికుల పరిస్థితి ఏంటి? విసిగిపోతారు… తిట్టుకుంటారు కూడా. కానీ ఇక్కడ ప్రయాణికులు తాము ఎక్కాల్సిన రైలు కోసం ఏకంగా 9 గంటలు రైల్వేస్టేషన్‌లో కళ్లలో వత్తులేసుకుని మరీ ఎదురు చూశారు. ఎట్టకేలకు రైలు రానే వచ్చింది. దానిని చూసి వారి ఆనందానికి హద్దులు లేవు. చప్పట్లు కొడుతూ ఆలస్యంగా వచ్చిన రైలుకు స్వాగతం పలికారు. ఆనందంతో డ్యాన్సులు చేస్తూ కేరింతలు కొట్టారు. చివరకు రైలెక్కారు. ఇక తమ గమ్యం చేరడం గురించి ఆలోచిస్తున్నారు.ఇంతలో వారి ఆనందం కాస్తా ఆవిరైపోయింది. మార్గమధ్యంలోని ఓ స్టేషన్‌లో రైలు ఆగిపోయింది. రైలు ఇంజిన్‌లో లోపం తలెత్తి రైలు ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. దాన్ని సరిచేసేందుకు సిబ్బంది చాలా కష్టపడ్డారు. ఈ క్రమంలో నాలుగు గంటలపాటు వేచి ఉన్న ప్రయాణికులు ఇంజిన్‌ పనిచేయకపోవడంతో చేసేది లేక కాలికి బుద్ధి చెప్పారు. మిణుకుమంటున్న ఆశతో కొందరు అదే రైలులో ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రయాణికులు చప్పట్లు కొట్టి మరీ స్వాగతించిన ఈ రైలు, మహారాష్ట్రలోని గోండియా నుంచి చంద్రాపూర్‌లోని బల్లార్షాలో ఈ రైలు నిలిచిపోయింది. అంతకు 4 గంటల ముందు ఇదే రైలును గోండియా స్టేషన్‌లో చప్పట్లు కొట్టి మరీ ప్రయాణికులు స్వాగతించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Follow us on