AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

viral video: అమ్మో లేడీ కాదు పెద్ద కిలాడీ.. పవిత్రమైన శుభలేఖలను ఎలా వాడిందో చూస్తే మైండ్‌ బ్లాంకే..

viral video: అమ్మో లేడీ కాదు పెద్ద కిలాడీ.. పవిత్రమైన శుభలేఖలను ఎలా వాడిందో చూస్తే మైండ్‌ బ్లాంకే..

Anil kumar poka
|

Updated on: Sep 20, 2022 | 9:58 AM

Share

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన క్షణం. అంత మంచి శుభకార్యం జరుగబోతోంది అందరూ ముందుగా అభినందనలు తెలుపుతారు. ఆహ్వాన పత్రికను సంతోషంగా స్వీకరిస్తారు.


పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన క్షణం. అంత మంచి శుభకార్యం జరుగబోతోంది అందరూ ముందుగా అభినందనలు తెలుపుతారు. ఆహ్వాన పత్రికను సంతోషంగా స్వీకరిస్తారు. అయితే, తాజాగా ఓ పెళ్లి కార్డుకు సంబంధించి షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎంతో పవిత్రంగా భావించే పెళ్లి ఆహ్వాన పత్రికను అసాంఘీక కార్యక్రమాలకు వినియోగిస్తూ ఓ అమ్మాయి అడ్డంగా బుక్కైంది. అది గమనించిన అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. అవును.. ఓ అమ్మాయి వెడ్డింగ్ కార్డులో దాచి డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తోంది. ఎయిర్ పోర్ట్‌లో అధికారుల తనిఖీల్లో ఈ బాగోతం బయటపడింది. అది చూసి అధికారులే షాక్ అయ్యారు. ఎయిర్‌పోర్టులో ఓ అమ్మాయి నడవడిక అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు చెక్ చేశారు. అంతా చెక్ చేసినా ఏమీ లభించలేదు. చివరకు వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డులను పరిశీలించారు. వాటిని ఓపెన్ చేయగా లోపల అంతా డ్రగ్స్. ఖంగుతిన్న అధికారులు వెంటనే ఆ వెడ్డింగ్ కార్డును స్వాధీనం చేసుకుని, యువతిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ వీడియోను ఐపిఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ ఉన్న పెళ్లి కార్డుతో ఒక అమ్మాయి పట్టుబడింది’ అనే క్యాప్షన్ పెట్టారు. అలాగే, విమానాశ్రయంలో ఎవరి నుండి ఏమీ తీసుకోవద్దని ప్రజలను హెచ్చరించారు. ఇదిలాఉంటే.. వాస్తవానికి ఈ వీడియో దాదాపు రెండేళ్ల క్రితం నాటిది. అయితే, ప్రస్తుత కాలంలో ఎయిర్‌పోర్టుల ద్వారా స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నాటి వీడియోను ఐపీఎస్ అధికారి ఇప్పుడు షేర్ చేశారు. ప్రయాణికుల్లో అవగాహన కల్పించడం కోసం ఆయన ఇలా షేర్ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 20, 2022 09:57 AM