Tiger Viral Video: గౌరవనీయులైన పులి గారి రాకతో నిలిపివేసిన ట్రాఫిక్‌..! అరుదైన వైరల్ వీడియో మీకోసం..

Updated on: Jul 30, 2022 | 5:00 PM

సాధారణంగా ఎవరైన V.I.Pలు వాహనాల్లో వస్తున్నారంటే.. ఆ ప్రాంతమంతా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంటారు పోలీసులు. సామాన్య వ్యక్తులు ఎవరూ రోడ్డు మీదకు రాకుండా


సాధారణంగా ఎవరైన V.I.Pలు వాహనాల్లో వస్తున్నారంటే.. ఆ ప్రాంతమంతా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంటారు పోలీసులు. సామాన్య వ్యక్తులు ఎవరూ రోడ్డు మీదకు రాకుండా ఎక్కడి వాహనాలు అక్కడికి నిలిపివేస్తుంటారు. అయితే ఇప్పుడో పులి కోసం ట్రాఫిక్‌ను నిలిపివేశారు అటవీ శాఖ అధికారులు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.మహారాష్ట్రలోని చంద్రపుర్‌లో ఉన్న ఓ హైవేపై భారీ ట్రాఫిక్‌ ఉన్న కారణంగా.. రోడ్డు దాటలేక పులి అక్కడే పక్కన కూర్చుంది. అదే సమయంలోనే కొందరు.. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న సిబ్బంది.. ట్రాఫిక్‌ను నిలిపివేశారు. అనంతరం.. పులి అక్కడి నుంచి లేచి స్టైల్‌గా రోడ్డు దాటుకుంటూ వెళ్లిపోయింది. కొందరు వాహనాదారులు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో రికార్డు చేసి.. నెట్టింట్లో పోస్ట్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..

Bus Shelter – Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

Published on: Jul 30, 2022 05:00 PM