ఫోటో పెట్టు.. రూ.1000 పట్టు

Updated on: Oct 16, 2025 | 7:10 PM

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు బంపర్‌ ఆఫర్‌. టోల్ ప్లాజాల వద్ద ఉండే మరుగుదొడ్లు అపరిశుభ్రంగా కనిపిస్తే, దానిని ఒక ఫొటో తీసి పంపితే చాలు.. మీ ఫాస్టాగ్‌ ఖాతాలో రూ.1000 బహుమతిగా జమ అవుతుంది. టోల్ ప్లాజాల వద్ద పరిశుభ్రతను పెంచే లక్ష్యంతో ఎన్‌హెచ్‌ఏఐ ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈ బహుమతిని పొందాలనుకునే ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని ‘రాజ్ మార్గ్ యాత్ర’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. టోల్ ప్లాజా వద్ద టాయ్‌లెట్‌ అపరిశుభ్రంగా కనిపిస్తే వెంటనే ఫొటో తీసి, దానిని ఆ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫొటోతో పాటు ఫోటో పంపినవారి పేరు, వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, ఫోన్ నెంబర్, లొకేషన్ తదితర వివరాలను కూడా నమోదు చేయాలని NHAI సూచించింది. ఇలా వచ్చిన ఫొటోలలో అర్హత ఉన్నవాటిని NHAI అధికారులు ఎంపిక చేస్తారు. ఎంపికైన ఫిర్యాదుదారుడి వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌కు అనుసంధానమై ఉన్న ఫాస్టాగ్ ఖాతాకు రూ.1000 రీఛార్జి రూపంలో జమ చేస్తారు. కానీ ఈ అవకాశం అక్టోబరు 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద పరిశుభ్రతను ప్రోత్సహించడంతో పాటు, మరుగుదొడ్ల నిర్వహణను మెరుగుపరిచే లక్ష్యంతో ఎన్‌హెచ్‌ఏఐ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు వెల్లడించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.18 లక్షల బాహుబలి గుమ్మడి.. బరువు 1064 కేజీలు

భగ్గుమన్న బంగారం-తగ్గిన వెండిగురువారం ధరలు ఎలా ఉన్నాయి

Madhavan: 50 ప్లస్ లో దూకుడు చూపిస్తున్న మాధవన్

సీన్ రివర్స్.. టికెట్ రేట్లపై మళ్లీ బాంబు

వేలకోట్లకు అధిపతి.. అయినా సైకిల్‌పైనే సవారీ