వాహనదారులకు అలర్ట్‌.. ఇలాంటివారికి నో పెట్రోల్‌

Updated on: Dec 12, 2025 | 5:24 PM

తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల్లో భద్రతా చైతన్యం పెంచడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో హెల్మెట్ వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో ప్రాణనష్టం నివారించడానికి హెల్మెట్ అత్యవసరమని వివరిస్తున్నారు. 'నో హెల్మెట్ నో పెట్రోల్', 'నో హెల్మెట్ నో రైడ్' నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ, యువతకు రోడ్డు నియమాల ప్రాముఖ్యతను బోధిస్తున్నారు.

తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో భద్రతా చైతన్యాన్ని మరింతగా పెంచడమే ప్రధాన లక్ష్యంగా పోలీసు యంత్రాంగా చర్యలు మొదలు పెట్టింది. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ వినియోగంపై విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇటీవల ద్విచక్ర వాహనాల ప్రమాదాలు పెరుగుతున్న నేపధ్యంలో ప్రాణనష్టం నివారణకు హెల్మెట్ వినియోగం అత్యంత కీలకమని అవగాహన కల్పిస్తున్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, బీట్ సిబ్బంది నేరుగా రంగంలోకి దిగారు. హెల్మెట్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యంగా యువత ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉండడంతో, వారికి ప్రత్యేకంగా చైతన్యం కల్పించే కార్యక్రమాలను పోలీసులు చేపట్టారు. ప్రమాదాలను నివారించేందుకు హెల్మెట్‌ ధరించడం, అధిక వేగాన్ని నివారించడం, రోడ్డు నియమాలు పాటించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడకపోవడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి జాగ్రత్తలు ప్రతి వాహనదారుడి బాధ్యత అని పోలీసులు సూచిస్తున్నారు. తిరుపతి జిల్లాలో అమలులో ఉన్న నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన ప్రకారం హెల్మెట్ లేకుండా వచ్చేవారికి పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వరాదని ఆదేశించారు. అలాగే నో హెల్మెట్ నో రైడ్ కార్యక్రమం ద్వారా చిన్న దూరానికైనా హెల్మెట్ లేకుండా ప్రయాణించరాదని, వాహనము నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని బలంగా ప్రచారం చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి వ్యక్తితోపాటు, వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగి హెల్మెట్‌ను ధరించాలని సూచించారు. రోడ్డు నియమాలను కచ్చితంగా పాటించాలని చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

వాతావరణశాఖ అలర్ట్‌.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త

హిట్ కావాలంటే సినిమా వాయిదా పడాల్సిందే.. కోలీవుడ్ హీరోల నయా స్ట్రాటజీ

Hrithik Roshan: ఆ సినిమాకు రివ్యూ ఇచ్చాడు.. ఇప్పుడు ఫుల్ ట్రోల్ అవుతున్నాడు.. ఎందుకు సర్ మనకి ఇవన్నీ..

ఆ బ్యాక్‌డ్రాప్‌ తో సినిమా వచ్చిందంటే హిట్ పక్కా.. కాసుల వర్షం కురిపిస్తున్న సినిమాలు