పాడుబడ్డ భవనంపై డ్రోన్ ఎగరేసిన పోలీసులు.. లోపలి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ??

Updated on: Oct 13, 2025 | 6:45 PM

టెంపుల్ సిటీ తిరుపతిలో పోలీసుల డ్రోన్ నిఘా కొనసాగుతోంది. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు నగరంలోని వివిధ ప్రాంతాలపై డ్రోన్ సర్వైలెన్స్‌ నిరంతరం జరుగుతోంది. ఈ డ్రోన్ ప్రధానంగా నగర పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను గుర్తించడంపై దృష్టి సారించింది. పాతబడిన భవనాలు, నిర్మానుష్యమైన శివారు ప్రాంతాలపై డ్రోన్ ద్వారా నిఘాపెట్టి పేకాట స్థావరాలు, గంజాయి, మత్తు పదార్థాల వినియోగం వంటి కార్యకలాపాలను పోలీసు శాఖ పర్యవేక్షిస్తోంది.

ఇందులో భాగంగా వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజన్న పార్క్ సమీపంలో ఉన్న ఇరిగేషన్ ఆఫీస్ వెనుక భాగంలో ఉన్న పాడుపడిన భవనం మీద ఎగరేశారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగి.. ఆ ఇద్దరు యువకులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి మత్తు ఇంజెక్షన్లు, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. యువత ఇలాంటి మత్తు పదార్థాల మాయలో పడొద్దని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వానపాము అనుకున్నారా ?? కాదు..ఇది నిజం పామే

రూపాయితో కూడా బంగారం కొనొచ్చు.. ఎలాగంటే..

దీపావళికి 9 రోజులు సెలవులు.. ఇక పండగే పండగ

చైనాకు ట్రంప్‌ బిగ్‌ షాక్‌.. అదనంగా 100 శాతం సుంకాలు

3 రోజుల్లో 3 వేల నుంచి 3.5 లక్షలకు !! దూసుకెళ్తున్న అరట్టై యాప్‌