Watch Video: కెమెరాలో చిక్కిన పులుల మధ్య భీకర పోరు.. చివరకు విషాదాంతం..!

|

Nov 19, 2023 | 6:51 PM

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లోని తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్‌లో రెండు పులుల మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పులల సంరక్షణ కోసం అటవీ శాఖ పలు చర్యలు తీసుకుంటోంది. అయితే పులులు పరస్పరం తలపడి, ఒకటి ప్రాణాలు కోల్పోవడం జంతు ప్రేమికులను ఆవేదనకు గురిచేస్తోంది.

మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. రెండు పులల మధ్య జరిగిన భీకర పోరులో ఓ పులి మృతి చెందింది. చంద్రాపూర్‌లోని తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. ఛోటా మట్కా, బజరంగ్ అనే రెండు పులులు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. కొన్ని గంటల పాటు సాగిన పోరులో బజరంగ్ అనే పులి మరణించింది. రెండూ హోరాహోరీగా తలపడుతున్న సమయంలో ఆ ప్రాంతం భీకర శబ్ధంతో దద్దరిల్లిపోయిందని సమీపంలోని గ్రామస్థులు తెలిపారు. అక్కడి అటవీ ప్రాంతంలో ఆధిపత్యం చాటుకోవడం కోసం ఆ రెండింటి మధ్య పోరు జరిగినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

తీవ్ర గాయాలతో చనిపోయిన బజరంగ్ మృత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. పులల సంరక్షణ కోసం అటవీ శాఖ పలు చర్యలు తీసుకుంటోంది. అయితే పులులు పరస్పరం తలపడి, ఒకటి ప్రాణాలు కోల్పోవడం జంతు ప్రేమికులను ఆవేదనకు గురిచేస్తోంది.

Published on: Nov 19, 2023 06:49 PM