Chandrayan Scientists: చంద్రయాన్-3 సక్సెస్‌లో ముగ్గురు తెలుగు మొనగాళ్లు..

|

Sep 29, 2023 | 9:45 PM

చంద్రయాన్-2 విఫలమైన ఒత్తిడి, చంద్రయాన్-3ను సక్సెస్ చేయాలనే తపన.. ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతగా శ్రమించారనేది విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగిన తర్వాత ప్రతీ ఒక్కరిలో కనిపించింది. బెంగళూరులోని కంట్రోల్ రూమ్‌లో ప్రతీఒక్కరూ చిన్నపిల్లల్లా మారిపోయారు. చంద్రయాన్-3 ఇస్రో సాధించిన విజయం.

చంద్రయాన్-2 విఫలమైన ఒత్తిడి, చంద్రయాన్-3ను సక్సెస్ చేయాలనే తపన.. ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతగా శ్రమించారనేది విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగిన తర్వాత ప్రతీ ఒక్కరిలో కనిపించింది. బెంగళూరులోని కంట్రోల్ రూమ్‌లో ప్రతీఒక్కరూ చిన్నపిల్లల్లా మారిపోయారు. చంద్రయాన్-3 ఇస్రో సాధించిన విజయం. ఇందులో తెరపైన కనిపించే వ్యక్తులతో పాటు తెర వెనుక అనేక మంది వ్యక్తులు, సంస్థలు ఉన్నాయి. ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్‌లో శాస్త్రవేత్తలు, టెక్నీషియన్లు, నాన్ టెక్నికల్ సిబ్బంది, మరి కొన్ని ఇతర సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగం పంచుకున్నాయి. ఈ ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన వారిని ప్రపంచానికి పరిచయం చేశారు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్.

వాస్తవానికి ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 లోని రోవర్, ల్యాండర్ 14 రోజులు మాత్రమే పనిచేస్తాయని ప్రకటించారు. కానీ ఇకపై కూడా రోవర్ పనిచేస్తుందని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. చంద్రుడిపై అనేక దేశాలు ప్రయోగాలు చేశాయి. కానీ ఇప్పటి వరకు దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన దేశం భారత్ మాత్రమే.. అలాంటి క్లిష్టమైన, కీలకమైన ప్రయోగంలో ముగ్గురు శాస్త్రవేత్తల పాత్ర ప్రధానంగా చెప్పుకోవాలి. ఆ ముగ్గురు కూడా తెలుగు వారు కావడం గొప్ప విషయంగా రెండు రాష్ట్రాల ప్రజలు గర్విస్తున్నారు.. చంద్ర యాన్ 3 లో కీలక పాత్ర పోషించిన తెలుగు శాస్త్ర వేత్తలలో వల్లూరు ఉమామహేశ్వరరావు ఒకరు. ఈయన అత్యంత కీలకమైన చంద్రయాన్-3 ఆపరేషన్ మేనేజర్‌గా పనిచేశారు. పదేళ్లలో ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో, చంద్రయాన్‌-2లో భాగస్వామిగా ఉన్నారు. ఆయన సొంతూరు తెలంగాణలోని ఖమ్మం. చదివిందంతా కూడా అక్కడే. నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ఖమ్మంలో చదివారు. 5వ తరగతి నుంచి 7 వరకు మమ్మిళగూడెంలో చదువుకున్నారు. ఇక, 8వ తరగతి నుంచి పది వరకు న్యూ ఎరా స్కూల్ కు వెళ్లారు. పదవ తరగతిలో 600 మార్కులకు గానూ 534 మార్కులు సాధించి రాష్ట్రంలో ఉత్తమ విద్యార్థిగా నిలిచారు. అనంతరం 2007 నుంచి 2009 వరకు ఇంటర్ మీడియట్ విజయవాడలోని శ్రీ చైతన్య రామన్ భవన్ లో చదవగా వెయ్యి మార్కులకు గాను 955 మార్కులు సాధించారు. 2009 నుంచి 2013 వరకు కేరళలోని త్రివేండ్రం లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ సైన్సు టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేసి ఆల్ ఇండియాలో 136 ర్యాంకు సాధించి తొలి ప్రయత్నంలోనే ఇస్రోలో జాబ్ సాధించారు. 2013 నుంచి 2020 వరకు ఎంసిఎఫ్ హసన్‌లో ఉద్యోగం చేశారు. 2020లో యు ఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ లో శాస్త్రవేత్తగా జాయిన్ అయి చంద్రయాన్ 3 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన ల్యాండర్, రోవర్ ఆపరేషన్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టి విజయం సాధించారు. చంద్రయాన్‌-3ని డిజైన్‌ చేసిన 30 మంది శాస్త్రవేత్తల బృందంలో ఉమామహేశ్వరావు ఒకరు. చంద్రయాన్ 3 లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేమన్నారు.

చంద్రయాన్-3 కోసం కీలక పాత్ర పోషించిన మరో తెలుగు శాస్త్రవేత్త మోటమర్రి శ్రీకాంత్. శ్రీకాంత్‌ స్వస్థలం విశాఖపట్నం సీతమ్మధార. ఆయన తండ్రి ఎంఎస్‌ఎన్‌ మూర్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో ఇంజినీర్‌గా పనిచేసి బెంగళూరులో స్థిరపడ్డారు. శ్రీకాంత్‌ మచిలీపట్నంలో డిగ్రీ ప్రథమ సంవత్సరం, విశాఖ ఏవీఎన్‌ కాలేజ్‌లో డిగ్రీ సెకండ్‌, ఫైనలియర్‌ చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎస్‌సీ ఎలక్ట్రికల్‌ చేశారు. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో ఎంటెక్‌ చేశారు. అనంతరం బెంగళూరు ఇస్రోలో సైంటిస్ట్‌గా చేరారు. ఇస్రోలో అంచలంచెలుగా వివిధ హోదాల్లో పనిచేశారు. మార్స్‌ మిషన్‌కు ఆపరేషన్‌ డైరెక్టర్‌గా పనిచేశారు శ్రీకాంత్. 2019లో చంద్రయాన్‌ 2కు డిప్యూటీ మిషన్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రపంచ చరిత్ర సృష్టించిన చంద్రయాన్‌ 3కి మిషన్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. చంద్రయాన్‌ విజయంలో తన భర్త పాత్ర ఉండడం ఎంతో ఆనందంగా ఉందని శ్రీకాంత్ భార్య చెప్పారు. నంద్యాల జిల్లాకు చెందిన సైంటిస్ట్ కందురి కిరణ్ కుమార్ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్నారు. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై దిగేలా ఇస్రో రూపొందించిన ఆపరేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. చంద్రయాన్‌-3 విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై అడుగు పెట్టే సమయంలో అందరితో కలిసి పర్యవేక్షిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన.ముగ్గురు శాస్త్ర వేత్తలు ఇప్పటికే జీశాట్ 29, నావిగేషన్ శాటిలైట్‌లో వన్ డీ, వన్ ఈ, వన్ ఎఫ్ తో పాటు చంద్రయాన్ 3 లో కీలక పాత్ర పోషించారు. చంద్రయాన్-3తో ప్రపంచ దేశాల ముందు మన దేశం గర్వపడేలా ఇస్రో చేసింది. అయితే ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంలో మన తెలుగువారి పాత్ర కూడా ఉంది. సీనియర్లతో పాటుగా యువ సైంటిస్టులు భాగస్వాములుగా ఉన్నారు. ఇది మన తెలుగుజాతికే గర్వకారణం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..