Modern Dance: మోడ్రన్‌ నాట్యంతో అదరగొట్టిన అమ్మాయిలు.. ఇండియన్‌, వెస్ట్రన్‌ కలిపి కొట్టిన వైనం..

Updated on: May 28, 2022 | 9:12 PM

ఇటీవల రకరకాల డాన్సులతో చాలామంది సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వీడియోలను నెటిజన్లు కూడా బాగానే ఆదరిస్తారు కూడా. తాజాగా ఓ ముగ్గురు అమ్మాయిలు ఓ ఇంగ్లీష్‌ పాటలకు అద్భుతంగా డాన్స్‌ చేశారు.


ఇటీవల రకరకాల డాన్సులతో చాలామంది సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వీడియోలను నెటిజన్లు కూడా బాగానే ఆదరిస్తారు కూడా. తాజాగా ఓ ముగ్గురు అమ్మాయిలు ఓ ఇంగ్లీష్‌ పాటలకు అద్భుతంగా డాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ డాన్స్‌ వీడియో నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ అమ్మాయిలను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. వైరల్ అవుతున్న ఈబవీడియోలో ముగ్గురు అమ్మాయిలు అందంగా సంప్రదాయ దుస్తులు ధరించి వేదికపై డ్యాన్స్ చేస్తున్నారు. కొన్ని విదేశీ పాటలకు కొంత భరతనాట్యం, కొంత వెస్ట్రన్‌ కలిపి సూపర్‌గా డాన్స్‌ చేస్తున్నారు. వెస్ట్రన్ మ్యూజిక్‌కి వారు ఇస్తున్న ఎక్స్‌ప్రెషన్స్‌ నెటిజన్లని హుషారెత్తిస్తున్నాయి. ఈ వీడియోని ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఉషా జే వృత్తి రీత్యా కొరియోగ్రాఫర్ ఆమె ఈ నృత్యానికి కొరియోగ్రఫీ చేశారు. ఈ అద్భుతమైన డ్యాన్స్ వీడియోను ఉషా జె అనే కొరియోగ్రాఫర్ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. పైగా ఈ నాట్యానికి హైబ్రిడ్‌ భరతనాట్యమని పేరు పెట్టారు. ఈ వీడియోను లక్షలమందికి పైగా వీక్షిస్తున్నారు. వేలల్లో లైక్ చేస్తూ రీ ట్వీట్‌ చేస్తున్నారు. అంతేకాదు పలురకాల కామెంట్లతో అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

Published on: May 28, 2022 09:12 PM