Scorpions: లక్షలాది  విషపూరిత తేళ్లు ఒకే చోట.. ఒళ్ళు గగుర్పాటు కలిగిస్తున్న షాకింగ్ వీడియో..!

Scorpions: లక్షలాది విషపూరిత తేళ్లు ఒకే చోట.. ఒళ్ళు గగుర్పాటు కలిగిస్తున్న షాకింగ్ వీడియో..!

Anil kumar poka

|

Updated on: May 21, 2022 | 8:27 AM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ షాకింగ్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. కొన్ని వీడియోలు అశ్చర్యానికి గురి చేస్తే, మరి కొన్ని భయానకంగా ఉంటాయి. తాజాగా బయటపడిన ఓ వీడియో ఒళ్లు గగుర్పాటు కలిగిస్తోంది. భయంకరమైన జంతువులకు భయపడి


సోషల్ మీడియాలో ప్రతిరోజూ షాకింగ్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. కొన్ని వీడియోలు అశ్చర్యానికి గురి చేస్తే, మరి కొన్ని భయానకంగా ఉంటాయి. తాజాగా బయటపడిన ఓ వీడియో ఒళ్లు గగుర్పాటు కలిగిస్తోంది. భయంకరమైన జంతువులకు భయపడి తమను తాము రక్షించుకోవాడానికి ప్రయత్నిస్తుంటారు మనుషులు. అయితే, అదే రీతిలో జంతువులు సైతం ఇతర ప్రాణుల నుంచి తమని తాము రక్షించుకోవాలని చూస్తుంటాయి. ఈ క్రమంలో పరిమాణంలో చిన్నవైన విషపూరిత తేళ్లు అన్నీ ఒకే చోట చేరితే.. అవన్నీ ఓ ఇంట్లో దూరితే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే జరిగింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మనకు సాధారణంగా కనిపించే తేళ్ల విషం అంత ప్రాణాంతకం కాదు. అదే సమయంలో నిద్రపోవడానికి నిత్య ఒక చుక్క తేలు విషం సేవించే వ్యక్తులు కూడా ఉన్నారు. తేళ్లను విషపూరితమైనవిగా భావించి వాటిని చంపడం లేదా వాటి నుండి తమను తాము రక్షించుకోవడం చూస్తుంటాం. వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో, ఒక ఇంటి నేలమాళిగలో వందలాది తేళ్లు బయటపడ్డాయి. ఈ వీడియోలో ఒక ఇంటి నేలమాళిగలో చాలా తేళ్లు కనిపించాయి. వీటిని వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడయాలో పెట్టాడు. దీన్ని చూసిన నెటిజన్లు తమ కళ్లను తామే నమ్మేలేమంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోపై చాలా మంది స్పందిస్తున్నారు. ఆ తేళ్లన్నీ విషపూరితమైనవని, వాటి విషం కోసం మాత్రమే వాటిని పెంచుతూ ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం వాటిని మందులు తయారు చేసేందుకు ఉపయోగిస్తూ ఉండవచ్చని అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!

Published on: May 21, 2022 08:27 AM