Dog and Child: స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం మన అరచేతుల్లో దర్శనమిస్తుంది. ఎక్కడ ఏ వింతలు జరిగినా వెంటనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ముఖ్యంగా జంవుతులకు సంబంధించిన వీడియోలు అయితే నెటిజన్లను బాగా ఆకర్షిస్తుంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి. పెంపుడు జంతువులు కొన్ని మనం నేర్పకపోయినా.. మనుషులని అనుకరిస్తుంటాయి. ఆ విషయం మనకు తెలియదు.. అనుకోకుండా ఏదో ఒక సందర్భంలో అది మన కంట పడుతుంది. అలాంటి ఓ కుక్క పిల్ల వీడియో ఒకటి నెట్టంట తెగ వైరల్ అవుతోంది. ఈ క్యూట్ వీడియోను చూసి నెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు. లైక్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేటెందుకు .. నెటిజన్లను అంతగా ఆ కుక్కపిల్ల ఎం చేస్తుందంటే..
ఐఎఫ్ ఆఫీసర్ సుశాంత నంద తాజాగా ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేశారు. అంతేకాదు ఆ వీడియో కి టీచింగ్ అనేది మనసు పెట్టి చేయాల్సిన పని.. ఈ కుక్కపిల్ల ఓ చిన్నారికి పాకడం ఎలా అనేది నేర్పిస్తుంది. పప్పి.. చిన్నారికి పాకడం నేర్పిస్తున్నది చూపిస్తుంటే.. అది కూడా ఒక కళ .. చాలా అందంగా ఉంది అంటూ కామెంట్ ను జతచేశారు. ఓ కుక్కపిల్ల ఒక చిన్నారి ఇద్దరు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ పసివాడు నేలపైన పాకడానికి ప్రయత్నిస్తున్నాడు. అది గమనించిన కుక్క ఆ చిన్నారికి ఎలా పాకాలో అది పాకుతూ చూపిస్తుంది.. మొదట పొట్టతో నేలమీద పాకి చిన్నారికి చూపిస్తుంది. మధ్యలో ఆ పసివాడి దగ్గరకు వెళ్లి ఇలా పాకాలి అన్నట్టుగా చిన్నారిని తట్టి మరీ చెబుతుంది.. మళ్లీ ముందు కాళ్లపై పాకుతూ ఇలా కూడా పాకొచ్చు అన్నట్టుగా చూపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
Teaching is a work of heart?
Doggy teaching the design & art of crawling to the baby is so beautiful pic.twitter.com/mj8OOxDv3W— Susanta Nanda IFS (@susantananda3) November 19, 2021
Also Read: పేగు బంధాన్ని మరచిన తల్లిదండ్రులు.. పునర్జన్మ ప్రసాదించిన వీధి పిల్లులు..