నటితో ప్రేమలో పడ్డ దొంగ.. గిఫ్ట్‌ కింద రూ.3 కోట్ల ఇల్లు

Updated on: Feb 11, 2025 | 9:57 PM

పంచాక్షరి స్వామి. ఈ పేరు వినగానే.. అరే బాగుందే అనుకుంటారు. ఎంచక్కా స్వామివారి పేరు పెట్టుకున్నాడు అని ఫీలవుతారు. కానీ మనోడు చోరశిఖామణి అని తెలిసిన వెంటనే షాకవుతారు. అదే వాడి స్పెషల్. అందులోనూ 15 ఏళ్లకే ఈ ప్రొఫెషన్ లోకి వచ్చేశాడు. కోట్లు కొల్లగొట్టేశాడు. మామూలుగా అయితే కడుపులో చల్ల కదలకుండా కూర్చోవచ్చు.

కానీ ఓ నటితో లవ్ ఎఫైర్ నడిపాడు. ఆవిడగారికి 3 కోట్లు పెట్టి భారీ భవంతిని కట్టించేశాడు. ఇంట్లో అందంగా ఉంటుందని.. 22 లక్షలు పెట్టి పెద్ద అక్వేరియం కూడా కొన్నాడు. కానీ ఆ పంచాక్షరి స్వామి కేసులో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అదే ఈ స్టోరీ! మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన 37 ఏళ్ల పంచాక్షరి స్వామి స్టోరీ ఇది. తాజాగా ఓ దొంగతనం కేసులో బెంగళూరు పోలీసులు పంచాక్షరి స్వామిని అరెస్ట్ చేయడంతో అతడి చోరీల చిట్టా మొత్తం బయటికి వచ్చింది. చిన్నతనం నుంచి అంటే 15 ఏళ్ల నుంచి చోరీలు చేయడం ప్రారంభించి చోరీలే ఫుల్ టైమ్ వృత్తిగా చేసుకునట్లు విచారణలో తేలడంతో పోలీసులే షాక్ అయ్యారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటిని అమ్మి ప్రియుడితో పరారైన భార్య.. పాపం చివరికి భర్త..

గాయానికి కుట్లకు బదులు ఏకంగా ఫెవిక్విక్‌ రాసి చికిత్స.. కట్ చేస్తే..

అడవి పంది అనుకుని వ్యక్తిపై కాల్పులు.. సీన్ కట్ చేస్తే

సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూసే ఈ పువ్వు మీ ఇంట ఉంటే..

TOP 9 ET News: రూ.100 కోట్ల దిశగా తండేల్..సాధించిన చైతూ | విశ్వక్ సేన్ కొంపముంచిన పృథ్వీ మేక డైలాగ్