Gulmarg: మంచు గడ్డలను చీల్చుకుంటూ పట్టాలపై పరుగులు తీస్తున్న రైలు.. సూపర్ వీడియో.
ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని చాలా ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తోంది. ఆయా ప్రాంతాలు కనుచూపు మేర దవళ వర్ణంతో ఆకట్టుకుంటున్నాయి. ఎటుచూసినా తెల్లని మంచు పాలనురుగులా వ్యాపించి ఆకట్టుకుంటోంది. అడుగుల మేర పేరుకుపోయిన మంచు పర్యాటకులకు కనువిందు చేస్తోంది. మంచు అందాలను, చల్లని వాతావరణాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని చాలా ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తోంది. ఆయా ప్రాంతాలు కనుచూపు మేర దవళ వర్ణంతో ఆకట్టుకుంటున్నాయి. ఎటుచూసినా తెల్లని మంచు పాలనురుగులా వ్యాపించి ఆకట్టుకుంటోంది. అడుగుల మేర పేరుకుపోయిన మంచు పర్యాటకులకు కనువిందు చేస్తోంది. మంచు అందాలను, చల్లని వాతావరణాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో 24 గంటలుగా మంచు వర్షం పడుతోంది. సిమ్లాలోని కుఫ్రి, ఖరపత్తర్, మనాలీ సహా పలు ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణంతో మెరిసిపోతున్నాయి. రహదారులు, ఇళ్లు, భవనాలపై దట్టంగా మంచు పేరుకుపోయింది. సందర్శకులు మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. మంచులో తడుస్తూ ఆటలు ఆడుతూ సందడి చేస్తున్నారు. ఇటు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనూ భారీగా మంచు కురుస్తోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన తెహ్రీ గర్వాల్, ధనౌల్తి, సుర్కందా దేవి కొండలు మంచుతో కప్పుకొని కనువిందు చేస్తున్నాయి. ఇక బద్రీనాథ్ ఆలయం కూడా పూర్తిగా మంచుతో కూరుకుపోయింది.
జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ పూంచ్, రాజౌరీ, శ్రీనగర్, కుప్వారా, మిచిల్ సెక్టార్ , ఉదంపూర్ తదితర ప్రాంతాల్లో భారీగా మంచు పడుతోంది. రియాసి జిల్లాలోని మహోర్ ప్రాంతం మొత్తం తెల్లగా మారిపోయింది. మంచు కారణంగా పూంచ్- రాజౌరి జిల్లాలను శ్రీనగర్‌కు కలిపే మొఘల్ రోడ్డును అధికారులు మూసివేశారు. ఉధంపూర్‌లోని బసంత్‌గఢ్ లయలో మంచు పడుతోంది. దీంతో ఆ ప్రాంతమంతా వండర్ ల్యాండ్‌గా మారిపోయింది. కిష్త్వార్ మొత్తం దట్టమైన మంచుతో కప్పుకుపోయింది. మంచు కారణంగా చాలా రోజుల తర్వాత గుల్మార్గ్‌లో పర్యాటకుల సందడి నెలకొంది. ఆయా ప్రాంతాల్లో భారీగా హిమపాతం పడుతుండటంతో సాధారణ జనజీవనానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇళ్లు, రోడ్లు, వాహనాలు, భవనాలు అన్నింటిపై భారీగా మంచు పేరుకుపోయింది. నీరు సైతం గడ్డకట్టుకుపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక బారాముల్లా-బనిహాల్ మధ్య రైల్వే ట్రాక్‌పై భారీగా మంచు పేరుకుపోయింది. మంచు గడ్డలను చీల్చుకుంటూ రైలు సేవలు కొనసాగుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos