Pupp bag stolen: క్యాష్ ఉందనుకుని సంచి ఎత్తుకెళ్లిన దొంగలు.. తీరా విప్పి చూడగా మైండ్ బ్లాంక్.!
”ఏదో అనుకుంటే.. ఇంకేదో అయిందే.. నాకే అనుకుంటే.. అది నీకూ జరిగిందే..” అనే పాట మీకు గుర్తు ఉండే ఉంటుంది . సరిగ్గా ఇక్కడ ఇద్దరు దొంగల పరిస్థితి ఇదే అయింది.
”ఏదో అనుకుంటే.. ఇంకేదో అయిందే.. నాకే అనుకుంటే.. అది నీకూ జరిగిందే..” అనే పాట మీకు గుర్తు ఉండే ఉంటుంది . సరిగ్గా ఇక్కడ ఇద్దరు దొంగల పరిస్థితి ఇదే అయింది. వారు ఒకటి అనుకుంటే.. చివరికి దేవుడు మరొకటి తలిచాడు. క్యాష్ ఉందనుకుని కష్టపడి సంచి దొంగలిస్తే.. దాన్ని విప్పి చూసి నోరెళ్ళబెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ నెల 7వ తేదీన ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. రవి అనే వ్యక్తి రాత్రి సమయంలో ఓ సంచి పట్టుకుని బైక్‌పై బయల్దేరాడు. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అతడి బైక్ ఆపి.. బ్యాగ్ ఇవ్వాలని బెదిరించారు. ఆ బ్యాగ్‌లో ఎలాంటి నగదు లేదని చెప్పినా వినకుండా సంచిని ఎత్తుకెళ్ళిపోయారు . ఇక చేసేదేమిలేక రవి పోలీసులను ఆశ్రయించాడు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే క్రమంలో అతడు చెప్పిన విషయం విని ఖాకీలు దెబ్బకు ఖంగుతిన్నారు.తన కుక్కపిల్లకు అనారోగ్యం చేస్తే.. వైద్యం నిమిత్తం ఓ సంచిలో పెట్టుకుని బైక్‌పై ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని.. మార్గమధ్యలో దుండగులు అడ్డుకుని ఆ సంచిని ఎత్తుకెళ్ళారని రవి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. కాగా, రవి చెప్పింది విని పోలీసులే ఖంగుతింటే.. నగదు అనుకుని బ్యాగ్ విప్పి చూసిన దొంగలకు ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..