Mother in Dumping Yard: కన్నతల్లిని డంపింగ్ యార్డ్‌లో అనాథగా వదిలి వెళ్లిన కొడుకు..

Updated on: Mar 06, 2023 | 9:43 AM

మానవత్వం మంట కలిసింది.. నవ మాసాలు కని పెంచిన కన్నతల్లే భారమైంది. కనికరం లేని కన్న కొడుకు ఏకంగా తల్లిని డంపింగ్ యార్డ్‌లో వదిలి వెళ్లాడు. కన్న ప్రేగే బరువుగా మారటాన్ని జీర్ణించుకోలేని తల్లి..

మానవత్వం మంట కలిసింది.. నవ మాసాలు కని పెంచిన కన్నతల్లే భారమైంది. కనికరం లేని కన్న కొడుకు ఏకంగా తల్లిని డంపింగ్ యార్డ్‌లో వదిలి వెళ్లాడు. కన్న ప్రేగే బరువుగా మారటాన్ని జీర్ణించుకోలేని తల్లి చనిపోవాలనుకుంది. అయితే చివరి క్షణంలో కొడుకు గుర్తొచ్చి బలవన్మరణ ప్రయత్నాన్ని విరమించుకుంది. డంపింగ్ యార్డులో ఉన్న ఆ వృద్దురాలిని గమనించిన స్థానికులు రెవిన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వీఆర్వో స్పందించి ఆ వృద్దురాలిని ఓల్డేజ్ హోమ్‌లో చేర్పించారు. రెండు రోజుల నుండి తాడేపల్లి బ్రహ్మానందపురంలోని డంపింగ్ యార్డులో ఒక వృద్దురాలు కూర్చుని ఉంది. ఈ విషయాన్ని స్థానికులు రెవిన్యూ అధికారులకు చెప్పడంతో వీఆర్వో గోలి ఇన్నయ్య డంపింగ్ యార్డు వద్దకు వచ్చి ఆ మహిళ వివరాలు సేకరించారు. తన పేరు రామలక్ష్మీ అని తన భర్త పేరు కృష్ణ అని చెప్పిన వృద్దురాలు తనది విజయవాడలోని గవర్నర్ పేట అని చెప్పింది. రెండు రోజుల క్రితం ఆమె కొడుకే ఆటోలో తనను ఇక్కడకు తీసుకొచ్చి వదిలి వెళ్లిపోయినట్లు తెలిపింది. వ్రద్దురాలు మానసిక స్థితి సరిగానే ఉన్నా కొడుకే డంపింగ్ యార్డులో వదిలి పెట్టి వెళ్లడంతో ఆవేదనకు గురై పూర్తి వివరాలు చెప్పటానికి నిరాకరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 06, 2023 09:42 AM