Slow Train: ఈ రైలుకు 111 స్టాప్‌లు.. దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు.!

|

Oct 24, 2024 | 7:22 PM

సాధారణంగా దూర ప్రయాణాలకు అనువైన ప్రయాణ సాధనం రైలు. మన దేశంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు రైల్వేవ్యవస్థ పనిచేస్తోంది. పాసింజర్‌ రైళ్ల నుంచి అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్‌ వరకూ అనేక రకాల రైళ్లు మనకున్నాయి. అయితే మనదేశంలో నెమ్మదిగా నడిచే రైలు కూడా ఒకటి ఉంది. ఆ రైలు దాదాపు 111 స్టేషన్‌లలో ఆగుతూ 37 గంటలకు గానీ గమ్యస్థానానికి చేరుకోదు. అయినా అందులో టికెట్లకు మాత్రం భారీ డిమాండ్‌ ఉంటుందట. ఇంతకీ ఆ రైలు ఏంటో తెలుసా?

దేశంలో అత్యధిక స్టాప్‌లు ఉన్న రైలు హౌరా-అమృత్‌సర్ మెయిల్. ఇది పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌ ఐదు రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది. ఈ రైలు ప్రారంభమైన తర్వాత దాని మార్గంలో ఉండే 111 స్టేషన్లలో ఆగుతుంది. పెద్ద స్టేషన్‌లలో కాస్త ఎక్కువ సేపు ఆగే ఈ రైలు చిన్న స్టేషన్‌లలో మాత్రం ఒకట్రెండు నిమిషాలకు మించి ఆగదు. హౌరా నుంచి అమృత్‌సర్ వరకు 1,910 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి ఈ రైలుకు 37గంటల సమయం పడుతుంది.

ఇక రైలులో టికెట్‌ ధరల విషయానికొస్తే, స్లీపర్ క్లాస్ రూ.695, థర్డ్ ఏసీ రూ. 1,870, రూ. సెకండ్ ఏసీ రూ.2,755, ఫస్ట్ ఏసీకి రూ.4,835గా టికెట్‌ ధరలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ ప్రాంతాలను కవర్‌చేస్తూ ఈ రైలు నడుస్తుండటంతో ప్రయాణికులు కూడా దీనికే మొగ్గు చూపుతున్నారు. ఇది హౌరా స్టేషన్ నుంచి రాత్రి 7.15 గంటలకు బయలుదేరి మూడో రోజు ఉదయం 8.40 గంటలకు అమృత్‌సర్ చేరుకుంటుంది. మళ్లీ అమృత్‌సర్ నుంచి సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరి మూడో రోజు ఉదయం 7.30 గంటలకు హౌరా స్టేషన్‌కు చేరుకుంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.