ఊసరవెల్లి రంగులు మారుస్తుండగా ఎప్పుడైనా చూశారా..
ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జీవులున్నాయి. వాటిలో కొన్ని జీవుల మనుగడ వింతగా ఉంటుంది. అలాంటివాటిలో ఊసరవెల్లి ఒకటి. ఇది ఎక్కడికక్కడ రంగులు మారుస్తుంటాయి.
ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జీవులున్నాయి. వాటిలో కొన్ని జీవుల మనుగడ వింతగా ఉంటుంది. అలాంటివాటిలో ఊసరవెల్లి ఒకటి. ఇది ఎక్కడికక్కడ రంగులు మారుస్తుంటాయి. కొన్నిసార్లు ఆకుపచ్చ, కొన్నిసార్లు ఎరుపు, కొన్నిసార్లు పసుపు ఇలా దానికి నచ్చిన రంగులోకి మారిపోతుంటుంది. తమ జీవన ప్రయాణంలో వాటి రక్షణకు తగ్గట్టుగా కలర్‌ని మార్చుకుంటుంటాయి. తమను తాము రక్షించుకోవడానికి, తమకు కావాల్సిన ఆహారాన్ని వేటాడేందుకు అవి రంగును మారుస్తుంటాయి.. ఊసరవెల్లి రంగు మారుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇది నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియోలో ఊసరవెల్లి క్షణ క్షణానికి రంగు మారుస్తూ కనిపించింది. కొన్ని అరటిపండ్లను టేబుల్‌పై ఉంచి, అదే టేబుల్‌పై ఓ వ్యక్తి తన పెంపుడు ఊసరవెల్లిని వదిలి వెళ్లాడు. ఊసరవెల్లి ఆ సమయంలో పచ్చగా కనిపించినా అరటిపండు దగ్గరికి రాగానే కొద్దిసేపటికే పసుపు రంగులోకి మారిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్లగానే స్ర్టాబెర్రీ పళ్లు ఉన్నాయి. అక్కడికి వెళ్లగా ఆ ఊసరవెల్లి ఎరుపు రంగులోకి మారిపోయింది. దాని రంగు మారడం ఆగదు, కొంచెం ముందుకు వెళ్లి నీలిరంగు వస్త్రం మీదకు ఎక్కింది. తక్షణం నీలిరంగులోకి మారిపోయింది. ఈ విధంగా, అది కేవలం కొన్ని సెకన్లలో తన మూడు విభిన్న రంగులను చూపించింది. ఇది ఒక అద్భుతమైన దృశ్యం. ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. ఈ వీడియోను లక్షలమంది వీక్షించగా వేలల్లో లైక్ చేశారు. ఊసరవెల్లి రంగులు మార్చడం ప్రత్యక్షంగా చూసి ముక్కున వేలేసుకుంటున్నారు నెటిజన్లు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీ ఉడుమును అమాంతం మింగేందుకు యత్నించిన కళింగ పాము.. చివరకు !!