Cancer: మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!

|

Oct 05, 2024 | 4:44 PM

పురుషులకు ప్రాణాంతకమైన ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు భారత్‌లో ఎక్కువవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు హెచ్చరిస్తున్నాయి. సెప్టెంబరును ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ అవగాహనా నెలగా పాటిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం.. ఎక్కువగా 50 ఏళ్ల లోపు వయసున్నవారు ఈ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. దాని తీవ్రత కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంటోంది. మిగిలినవాటితో పోలిస్తే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నెమ్మదిగా విస్తరిస్తోందని..

పురుషులకు ప్రాణాంతకమైన ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు భారత్‌లో ఎక్కువవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు హెచ్చరిస్తున్నాయి. సెప్టెంబరును ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ అవగాహనా నెలగా పాటిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం.. ఎక్కువగా 50 ఏళ్ల లోపు వయసున్నవారు ఈ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. దాని తీవ్రత కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంటోంది. మిగిలినవాటితో పోలిస్తే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నెమ్మదిగా విస్తరిస్తోందని.. సమస్యను మొదట్లోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఈ వ్యాధి వృద్ధులలో మాత్రమే కనిపించేది. కానీ ప్రస్తుతం యువకులు, మధ్య వయస్కుల వారూ ఎక్కువగా ఈ క్యాన్సర్‌ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మెట్రోపాలిటన్‌ నగరాల్లో నివసించే 35 నుంచి 44 మధ్య వయసు వారిలో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బాధితులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని వారు తెలిపారు. 2022లో భారత్‌లో 14 లక్షల కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదయ్యాయని.. అందులో 37,948 ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులేనని, ఇది మొత్తం క్యాన్సర్‌ కేసుల్లో 3 శాతం అని పేర్కొన్నారు.

సమస్యను వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్‌ నుంచి బతికి బయటపడటమనేది.. మనం దానిని ఎంత త్వరగా గుర్తించామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ శరీరంలో చాలా నెమ్మదిగా విస్తరిస్తుంది. కాబట్టి తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్యే ఉండదు. అమెరికాలో 80 శాతం మంది బాధితులు తొలి దశలోనే చికిత్సకు వస్తున్నారు. 20 శాతం మంది మాత్రం క్యాన్సర్‌ బాగా ముదిరిపోయిన తర్వాత డాక్టర్ల వద్దకు వస్తున్నట్టు తెలిపారు. భారత్‌లో దీనికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతోందని పేర్కొన్నారు. మూత్ర విసర్జన సమయంలో అసౌకర్యం కలుగుతుండటం, రాత్రుళ్లు పదేపదే లేవాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, నడుము లేదా జననాంగం వద్ద తీవ్రంగా నొప్పి ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు సూచనలని అన్నారు. వ్యాయామం చేయడంతో పాటు పళ్లు, కూరగాయలను డైట్‌లో భాగం చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.