Chicken Price: ఈ వారం చికెన్‌ ధరలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు.! మరీ ఇంత తక్కువ.?

|

Aug 21, 2024 | 8:58 PM

గత కొన్ని నెలలుగా కొండెక్కి కూర్చున్న చికెన్‌ ధరలు దిగొచ్చాయి. గత నెలలో కిలో చికెన్‌ రూ.280 నుంచి రూ.300 వరకు పలికిన చికెన్‌ ధర సగానికి సగం దిగొచ్చింది. నిన్న మొన్నటి వరకు చికెన్‌ రేట్లు చూసి గుటకలు మింగి సరిపెట్టుకున్నాడు. శుభకార్యాలు, పంక్షన్లకు కూడా అత్యవసరం అయితే తప్ప చికెన్‌ కొనలేని పరిస్థితి. ఇలా ఈ ఏడాది ప్రారంభం నుంచి చికెన్‌ రేట్లు చుక్కలు చూపిస్తూనే వచ్చాయి.

గత కొన్ని నెలలుగా కొండెక్కి కూర్చున్న చికెన్‌ ధరలు దిగొచ్చాయి. గత నెలలో కిలో చికెన్‌ రూ.280 నుంచి రూ.300 వరకు పలికిన చికెన్‌ ధర సగానికి సగం దిగొచ్చింది. నిన్న మొన్నటి వరకు చికెన్‌ రేట్లు చూసి గుటకలు మింగి సరిపెట్టుకున్నాడు. శుభకార్యాలు, పంక్షన్లకు కూడా అత్యవసరం అయితే తప్ప చికెన్‌ కొనలేని పరిస్థితి. ఇలా ఈ ఏడాది ప్రారంభం నుంచి చికెన్‌ రేట్లు చుక్కలు చూపిస్తూనే వచ్చాయి. కానీ అనూహ్యంగా ఈ నెల మొదటి వారం నుంచి చికెన్‌ ధరలు రోజురోజుకు పతనమవుతూ వచ్చాయి.

ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో ఈ నెలంతా పూజలు, వ్రతాలు ఇతర కార్యక్రమాలతో మహిళలు యమ బిజీగా ఉంటారు. దీంతో మహిళలు మాంసాహారాన్ని ఇంట్లోకి రానివ్వరు. మగవారు నేరుగా చికెన్‌ కొని ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితి. ఏదో రెస్టారెంట్‌కి వెళ్లి తినాల్సిందే. దీంతో చికెన్‌ వినియోగం తగ్గి ధరలు కూడా పడి పోయాయి. మరోవైపు పూజలు, వ్రతాలతో సంబంధం లేని మరి కొందరు మాంసం ప్రియులు ఇదే అదనుగా చికెన్‌ లాగించేస్తున్నారు.

ఆగస్టు 5న కిలో రూ.180 ఉన్న చికెన్‌ ధర.. ఆగస్టు 11వ తేదీ ఆదివారం నాటికి రూ.150కి పడిపోయింది. ఆగస్టు 17వ తేదీ శనివారం రూ.158గా ఉంది. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో ఆదివారాలతో సహా అన్ని రోజుల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఆదివారాల్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. దీంతో మిగతా రోజుల సంగతి ఎలా ఉన్నా.. ఆదివారం రాగానే చికెన్‌ రేట్లు అమాంతం పైకి ఎగబాకుతాయి. కానీ శ్రావణ మాసం కావడంతో అసలు కొనేవారే కరువయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.