Viral Video: కొన్నాళ్ళ క్రితం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ వీడియో గుర్తుందా? ఒక అమ్మాయి.. ఆమె పెంపుడు కుక్క యోగా చేస్తున్న వీడియో.. అమ్మాయి యోగా చేస్తుంటే పక్కనే ఆ అమ్మాయి మేరీతో పాటూ సమానంగా యోగా చేసిన ఆ పెంపుడు కుక్క వీడియో విపరీతంగా ట్రెండ్స్ లో నిలిచింది. ఇదిగో మళ్ళీ వారిద్దరిదీ మరో వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో సందడి చేస్తోంది. ఈసారి ఈ ఇద్దరూ బట్టలు ఉతికే పని పెట్టుకున్నారు. వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతకడం కోసం మేరీ తన బెస్ట్ ఫ్రెండ్ సీక్రెట్ మద్దతు తీసుకుంది ఈసారి. ఆమెకు సహాయం చేస్తూ బట్టలను వాషింగ్ మిషన్ లో వేయడమే కాదు.. బట్టలను తరువాత షెల్ఫ్ లలో కూడా సర్దుతూ కూడా సీక్రెట్ ఆ వీడియోలో కనిపించింది. తన స్నేహితురాలు మేరీతో సమానంగా బట్టలు వాషింగ్ మిషన్ లో వేసిన మేరీ.. తరువాత వాటిని జాగ్రత్తగా అలమారాలో సర్దేసింది. మరి ఈ ముచ్చటైన వీడియో చూసిన వారు కచ్చితంగా సీక్రెట్ కి ఫ్యాన్స్ అయిపోతారు కదూ.
ఈ వీడియోను షేర్ చేస్తూ మేరీ..”మేమిద్దరం కలిసి ఈ ఉదయం కొన్ని బట్టలు లాండ్రీ పని పూర్తి చేశాము. స్నేహితుడితో కలిసి సరదాగా ఏ పనైనా చేస్తుంటే భలే ఆశ్చర్యంగా ఉంటుంది.” అంటూ ఆమె కామెంట్ పెట్టింది. ఈ వీడియోకు ఇప్పటికే ఎభైవేలకు పైగా లైకులు వచ్చాయి. మేరీ..సీక్రెట్ ల స్నేహానికి అందరూ అభినందనలు చెబుతూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ ఇద్దరూ కలసి కనిపించిన ప్రతి వీడియో ఎదో ప్రత్యేకత తో ఉండడమే కాకుండా నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది.
ఇక్కడ మేరీ..సీక్రెట్ లాండ్రీ పని చేస్తున్న వీడియో చూసేయండి..
ఇంతకు ముందు సీక్రెట్ చేసిన యోగా వీడియో ఇదిగో మీకోసం..
సీక్రెట్ మేరీతో కలసి చేస్తున్న సందడికి సంబంధించిన మరో వీడియో ఇక్కడ మీకోసం..
Also Read: Viral Video: పెద్ద పులితో యువకుల పరాచకాలు.. అది ఏం చేసిందో మీరే చూడండి
Viral Video: దాహం తీర్చుకుంటున్న అడవిదున్నపై మొసలి మెరుపు దాడి.. గగుర్పాటుకు గురిచేసే వీడియో వైరల్.!