Viral Video: టంగ్‌తోపాటు పొట్టకూడా క్లీన్‌ చెయ్యాలనుకున్నట్టున్నాడు.. టంగ్‌ క్లీనర్‌ మింగేశాడు.

|

Aug 16, 2023 | 8:08 PM

బ్రష్​ చేసిన తర్వాత, నాలుక శుభ్రం చేసుకుంటూ ప్రమాదవశాత్తు టంగ్ క్లీనర్​ను మింగేశాడు ఓ యువకుడు. అది కాస్త గొంతులో ఇరుక్కుపోవడంతో అతడికి శ్వాస తీసుకోవడం కష్టమైపోయింది. ఉత్తర్​ప్రదేశ్​గోండా జిల్లాలో ఈ విచిత్ర ఘటన జరిగింది. మోతీగంజ్ ప్రాంతంలోని కర్మాయిని గ్రామానికి చెందిన శివకాంత్ రోజులాగే బ్రష్‌తో పళ్లను శుభ్రం చేసుకున్నాడు. ఆ తర్వాత టంగ్ క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకుంటున్న సమయంలో టంగ్ క్లీనర్‌ను మింగేశాడు.

బ్రష్​ చేసిన తర్వాత, నాలుక శుభ్రం చేసుకుంటూ ప్రమాదవశాత్తు టంగ్ క్లీనర్​ను మింగేశాడు ఓ యువకుడు. అది కాస్త గొంతులో ఇరుక్కుపోవడంతో అతడికి శ్వాస తీసుకోవడం కష్టమైపోయింది. ఉత్తర్​ప్రదేశ్​గోండా జిల్లాలో ఈ విచిత్ర ఘటన జరిగింది. మోతీగంజ్ ప్రాంతంలోని కర్మాయిని గ్రామానికి చెందిన శివకాంత్ రోజులాగే బ్రష్‌తో పళ్లను శుభ్రం చేసుకున్నాడు. ఆ తర్వాత టంగ్ క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకుంటున్న సమయంలో టంగ్ క్లీనర్‌ను మింగేశాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో శ్వాస తీసుకోలేకపోయాడు. ఛాతిలో నొప్పి కూడా మొదలైంది. సరిగా మాట్లాడటం కూడా రాలేదు. అతడి పరిస్థితి చూసి భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితిని చూసి అక్కడి వైద్యులు బాధితుడిని గోండాలోని ఆర్​ఎన్​ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ ఆర్ఎన్ పాండే బాధితుడి శివకాంత్ ఎక్స్-రే తీయించారు. రిపోర్ట్ చూసి డాక్టర్​ ఆశ్చర్యపోయిన డాక్టర్‌ వెంటనే యువకుడికి ఆపరేషన్ చేసి గొంతు లోపల ఇరుక్కుపోయిన టంగ్ క్లీనర్‌ను బయటకు తీశారు. ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి శివకాంత్​ ప్రాణాలను కాపాడినందుకు బాధితుడి కుటుంబ సభ్యులు డాక్టర్​కు కృతజ్ఞతలు తెలిపారు. యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతోందని డాక్టర్‌ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...