Techie Suicide: భార్యా, పిల్లల్ని చంపి ఆత్మహత్య.. ఆన్‌లైన్‌లో రంపం, కత్తి కొనుగోలు చేసి మరీ.. ఎందుకో తెలుసా.?

|

Jun 03, 2022 | 9:27 AM

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య, ఇద్దరు పిల్లల్ని అత్యంత దారుణంగా నరికి చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. వారిని హత్య చేసేందుకు.. ఏకంగా ఆన్‌లైన్‌లో కత్తి, రంపం ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు.


తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య, ఇద్దరు పిల్లల్ని అత్యంత దారుణంగా నరికి చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. వారిని హత్య చేసేందుకు.. ఏకంగా ఆన్‌లైన్‌లో కత్తి, రంపం ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. ఈ ఘటన చెన్నై నగరంలో సంచలనం రేపింది. ప్రకాష్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పల్లవరంలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి ఇంట్లో నుంచి ఎవరూ.. బయటికి రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పరిసరాలను తనిఖీ చేయగా, ఇంట్లో రక్తపు మడుగులో భార్య, ఇద్దరు పిల్లలు కనిపించారు. ప్రకాశ్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యా, పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రకాష్ సూసైడ్ లెటర్ రాశాడు. స్థానికుల నుంచి పలు వివరాలను సేకరించిన పోలీసులు.. నలుగురి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రకాశ్ భార్యా పిల్లలను హత్య చేసేందుకు ఆన్‌లైన్‌లో రంపం, కత్తిని కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నై పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 03, 2022 09:27 AM