Longest Squirrel: ఇంత పెద్ద ఉడుతను ఎప్పుడైనా చూశారా.? ప్రపంచంలోనే పొడవైన ఉడుత..
సోషల్ మీడియాలో పెంపుడు జంతువులే కాకుండా వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. వన్యప్రాణుల గురించి ఎన్నో తెలియని వింతలు విశేషాలు ఈ వీడియోల ద్వారా తెలుస్తుంది. తాజాగా ఓ ఉడుతకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని ఐఎఫెస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే ఈ ఫోటో స్పెషల్ ఏంటనేగా మీ అనుమానం..
సోషల్ మీడియాలో పెంపుడు జంతువులే కాకుండా వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. వన్యప్రాణుల గురించి ఎన్నో తెలియని వింతలు విశేషాలు ఈ వీడియోల ద్వారా తెలుస్తుంది. తాజాగా ఓ ఉడుతకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని ఐఎఫెస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే ఈ ఫోటో స్పెషల్ ఏంటనేగా మీ అనుమానం.. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఉడుత. నలుపు రంగులో ఉండే ఈ ఉడుత ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఉడుతల జాతిగా గుర్తింపు పొందిన జాతికి చెందినది. పశ్చిమబెంగాల్‌లోని బుక్సా టైగర్ రిజర్వ్‌లో తీసిన ఈ ఉడుత ఫొటోను ప్రవీణ్ కాస్వాన్ తాజాగా ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ప్రపంచంలోనే అతి పొడవైన ఈ ఉడుత జాతిని భారతదేశంలోనే గుర్తించారని ఆయన పేర్కొన్నారు. మీరు దీన్ని గుర్తుపట్టగలరా? అంటూ ట్విట్టర్‌ద్వారా ప్రశ్నించారు. ఆ పక్కనే బుక్సా ప్రాంతం పేరుకూడా ప్రస్తావించారు. ఈ ఉడుత ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. ఇది మలబార్ జాతి ఉడుత అని కొందరు, మలయాన్ జాతి ఉడుత అని మరికొందరు అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...