Jaipur: జడ్జినా.. మజాకా..! వరకట్న పిశాచి తిక్క కుదిర్చిన న్యాయమూర్తి.. వీడియో.

Updated on: Jun 26, 2023 | 9:42 AM

రాజస్థాన్‌ కోర్టులో అనుహ్య ఘటన చోటుచేసుకుంది. వరకట్న కేసు ఎదురుకుంటున్న ఓ వ్యక్తికి భలే పనిష్‌మెంట్ ఇచ్చారు న్యాయమూర్తి. జైపూర్ కు చెందిన దశరథ్ కుమావత్ 12 ఏళ్ల కిందట సీమా అనే మహిళను పెళ్లాడాడు. కొన్నాళ్ల తర్వాత సీమా తన భర్తపై వరకట్నం కేసు పెట్టింది.

రాజస్థాన్‌ కోర్టులో అనుహ్య ఘటన చోటుచేసుకుంది. వరకట్న కేసు ఎదురుకుంటున్న ఓ వ్యక్తికి భలే పనిష్‌మెంట్ ఇచ్చారు న్యాయమూర్తి. జైపూర్ కు చెందిన దశరథ్ కుమావత్ 12 ఏళ్ల కిందట సీమా అనే మహిళను పెళ్లాడాడు. కొన్నాళ్ల తర్వాత సీమా తన భర్తపై వరకట్నం కేసు పెట్టింది. గత ఐదేళ్లుగా ఈ కేసు కోర్టులో నడుస్తోంది. అయితే, భార్యకు జీవనభృతి కింద 2లక్షల 25వేల రూపాయలు చెల్లించాలంటూ కోర్టు దశరథ్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను దశరథ్ పెడచెవినపెట్టడంతో అతడిని జైల్లో వేశారు. దాంతో అతడి కుటుంబ సభ్యులు కోర్టు ఆదేశాల మేరకు జీవనభృతిని చెల్లించేందుకు ముందుకు వచ్చింది. అందులో భాగంగా 55 వేల నగదు కోర్టుకు సమర్పించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఆ డబ్బులో ఒక్క కరెన్సీ నోటు కూడా లేదు. అన్నీ నాణేలే. ఒక్కరూపాయి, రెండు రూపాయలు, 5,10 రూపాయల నాణేలతో కూడిన 7 పెట్టెలను దశరథ్ బంధువులు కోర్టుకు తీసుకువచ్చారు. ఆ నాణేల బరువు 280 కేజీలు. దీనిపై సీమా న్యాయవాది రామ్ ప్రకాశ్ కుమావత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన క్లయింటుకు చెల్లించాల్సిన జీవనభృతిని ఇలా నాణేల రూపంలో తీసుకురావడం కచ్చితంగా కక్షసాధింపు చర్య కిందకే వస్తుందని వాదించారు. ఇవన్నీ లెక్కపెట్టడం అయ్యే పనేనా అని ఆలోచించారు. ఈ క్రమంలో తెలివిగా ఆదేశాలు ఇచ్చారు జడ్జి. జైల్లో ఉన్న దశరథ్ ఈ నాణేలను 1000 రూపాయల చొప్పున బ్యాగుల్లో ఉంచి కోర్టుకు అందించాలన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..

Loading...
Unable to load recommendations.
Follow Us