Viral Video: గుట్కా తినేవారికి అత్యున్నత అవార్డ్‌.. ఏంటంటే..? చీఫ్‌ గెస్ట్‌గా…

|

May 21, 2022 | 8:11 AM

పొగాకు ఆరోగ్యానికి హానికరం, గుట్కా తినడం, చుట్ట, బీడీ, సిగరెట్లు తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలిసిందే. అందుకనే సిగరెట్, బీడీ ప్యాకెట్‌పై పెద్ద పెద్ద లెటర్స్ తో పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక రాసి ఉంటుంది. అయినా వాటిని ఎవరూ పట్టించుకోరు...


పొగాకు ఆరోగ్యానికి హానికరం, గుట్కా తినడం, చుట్ట, బీడీ, సిగరెట్లు తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలిసిందే. అందుకనే సిగరెట్, బీడీ ప్యాకెట్‌పై పెద్ద పెద్ద లెటర్స్ తో పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక రాసి ఉంటుంది. అయినా వాటిని ఎవరూ పట్టించుకోరు… అయితే ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా.. పొగాకు తాగడం వలన కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈక్రమంలో గుట్కా అలవాటుని వదిలించుకోవడానికి అద్భుతమైన ఆలోచన ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీన్ని ఓ ఐఏఎస్ అధికారి ట్విటర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.వైరల్ అవుతున్న ఈ ఫోటోలో, గోడపై కొన్ని వ్యాఖ్యలు రాసి ఉన్న పోస్టర్‌ ఒకటి అతికించి ఉంది. ఆ పోస్టర్ లో వరసగా గుట్కా తింటే.. కలిగే అనారోగ్యాలు ఒకొక్కటిగా వివరిస్తూ.. గుట్కా తినే వారికి ముందుగా వచ్చే అనారోగ్యం.. అందులోని దశలు, ఏ విధంగా శరీరంలో వ్యాధులు చేరతాయనే పలు అంశాలు వివరించారు.. చివరికి గుట్కా తింటే బహుమతిగా ఏడో స్థానంలో అత్యున్నత అవార్డుగా క్యాన్సర్ వస్తుందని చెప్పారు. అయినా గుట్కా తినడం కొనసాగిస్తే.. బహుమతిగా రామ నామం ఇవ్వాల్సి ఉంటుందని… గుట్కాతిన్న వ్యక్తికి ఆ బహుమతిని ఇచ్చే సమయంలో యమధర్మ రాజు ముఖ్య అతిథిగా హాజరవుతారని వివరిస్తూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ పోస్టర్ ను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ట్వీట్‌ను వేలాదిమంది లైక్‌ చేస్తూ, తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రముఖ నటీనటులు గుట్కాను తినమని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. సాధారణ ప్రజలు గుట్కాకు దూరమవుతారా లేదా దత్తత తీసుకుంటారా? ప్రజలందరూ ఈ విషాన్ని వదిలి అందమైన రేపటి వైపు పయనించాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు కానీ???? అంటూ గుట్కా యాడ్ ఉన్న పోస్టర్ ని షేర్ చేశారు.. మరొకరు ఈ గుట్కా పోస్టర్‌ను తయారు చేసి మా గ్రామంలోని ప్రతి ముఖ్యమైన ప్లేస్ లో పోస్ట్ చేస్తాను అంటూ ధన్యవాదాలు చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!

Published on: May 21, 2022 08:11 AM