నన్ను చంపండి ప్లీజ్.. కారుణ్య మరణం కోరుకునే చీమ!
చీమలు కేవలం శ్రమజీవులే కాదు, తోటి చీమల కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడతాయి. జబ్బుపడిన చీమలు తమ జాతి రక్షణకు స్వచ్ఛందంగా ప్రాణాలు అర్పిస్తాయని, రసాయన సంకేతాలతో తోటి చీమలకు సందేశం పంపిస్తాయని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాదు, గాయపడిన చీమలకు స్వయంగా సర్జరీ చేసే అద్భుత నైపుణ్యాలు కూడా వీటికి ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు.
చీమలు శ్రమ జీవులని అందరికీ తెలుసు. కానీ చీమలలో త్యాగం చేసే గుణం కూడా ఉంటుందట. తోటి చీమలకోసం ప్రాణత్యాగానికైనా సిద్దపడతాయట..మీరు బతకాలంటే నన్ను చంపేయండి.. అంటూ చీమలు ఇతర చీమలకు సంకేతాలు పంపిస్తాయట. ఈ విషయం ఇటీవల చీమలపై జరిపిన అధ్యయనాల్లో తెలిసింది. చీమల గురించి మరో సంచలన విషయం కూడా వెల్లడైంది. అదేంటంటే చీమలు గ్రేట్ సర్జన్స్. చీమలపై ఆస్ట్రియా పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో చీమల గురించి నమశక్యంగాని, ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటికొచ్చాయి. గాయపడిన తోటి చీమలకు స్వతహాగా సర్జరీ చేసి నయం చేసే స్కిల్స్ ఉన్నాయని పరిశోధనల్లో రుజువైంది. అయితే తీవ్రంగా రోగాల బారిన పడ్డ చీమలు తమ జాతిని కాపాడుకోవడానికి ప్రాణ త్యాగా నికి కూడా వెనుకాడబోవని ఆసక్తికర విషయం తెలిసింది. జబ్బుపడ్డ చీమ తనను చంపాలంటూ తన శరీరం నుంచి ఒక రకమైన రసాయనిక వాయువును సందేశంగా తోటి చీమలకు పంపిస్తాయని, ఆ సిగ్నల్స్‌ను అందుకున్న మిగతా చీమలు.. జబ్బు పడ్డ చీమను చంపేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెంది మిగతా చీమలు చనిపోకుండా ఉండేందుకే ఈ ప్రక్రియను బాధిత చీమలు అనుసరిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. మిగతా చీమల కంటే.. రాణి చీమకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, ఒకవేళ, రాణి చీమ జబ్బుపడితే మిగతా చీమలు ఏం చేస్తాయన్న దానిపై తాము ఇప్పుడు లోతుగా పరిశోధనలు చేస్తున్నట్టు తెలిపారు. ఆ వివరాలు ‘నేచర్ కమ్యూనికేషన్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. సృష్టిలో మనిషి తర్వాత అంతటి క్రమశిక్షణతో, సమాజబద్ధంగా జీవించే జీవులు ఏవైనా ఉన్నాయంటే అవి అనుమానమే లేకుండా చీమలేనని చెప్పాలి. చీమలు సంఘ జీవులు. అంటే మనుషుల్లాగే సామూహికంగా నివసిస్తూ, తమ కాలనీలో ప్రత్యేక బాధ్యతలతో జీవిస్తాయి. రాణి చీమ, కూలీ చీమలు, రక్షణ చీమలు అన్నీ తమ తమ విధులు నిర్వర్తిస్తూనే ఒక సమగ్ర వ్యవస్థలా పనిచేస్తాయి.చీమలు ఒకే గీతలో వరుసగా నడవడానికి, దారి తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోవడానికి కారణం వాటి అత్యంత బలమైన కమ్యూనికేషన్ వ్యవస్థ. చీమలు తమ ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన రసాయన పదార్థాన్ని నేలపై విడుదల చేస్తాయి. వీటిని శాస్త్రీయంగా ‘ఫెరోమోన్స్’ అంటారు. ఈ ఫెరోమోన్స్ వాసననే వెనుక వచ్చే చీమలు పసిగట్టి అదే దారిలో ప్రయాణిస్తాయి. ముందు చీమ వేసిన ఈ వాసన మార్గాన్ని అనుసరిస్తూ వేల సంఖ్యలో చీమలు ఆహారం దొరికే చోటుకు చేరుకుంటాయి. అందుకే వాటిని ఎంత గమనించినా అవి ఆ గీత దాటకుండా ఒకేదారిలో కదులుతుంటాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీవితాంతం కరెంటు బిల్లు ఫ్రీ.. ఒక్కసారి పెట్టుబడితో
ఇంటి డాబాపై భారీ వేప చెట్టు..! దీని వయస్సు 100 సంవత్సరాలు
Rajinikanth: రజినీకాంత్ సినిమాలో పవర్‌ఫుల్ పాత్ర చేజార్చుకున్న ఐశ్వర్యారాయ్
మన ఉస్మానియాకు అంతర్జాతీయ హంగులు.. కళ్లు చెదిరే రీతిలో మాస్టర్ ప్లాన్స్