woman wineyard: రైతుగా మారిన మహిళ.. ఏటా రూ 25 లక్షలు సంపాదన.. ఎలానో తెలిస్తే షాక్ అవుతారు.. (వీడియో)

|

Nov 04, 2021 | 9:33 AM

ఆధునిక విజ్ఞానంతో అంబరాలను చుంబించినా.. సముద్ర లోతులను కొలిచినా మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. కొన్ని పనులు మహిళలు చేయలేరంటూ తక్కువ చేసి చూడడం సర్వసాధారణమైంది.. అయితే ఓ మహిళ...


ఆధునిక విజ్ఞానంతో అంబరాలను చుంబించినా.. సముద్ర లోతులను కొలిచినా మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. కొన్ని పనులు మహిళలు చేయలేరంటూ తక్కువ చేసి చూడడం సర్వసాధారణమైంది.. అయితే ఓ మహిళ తనకు ఎదురైనా సవాళ్ళను అధిగమించింది. వ్యవసాయం చేయలేవు విజయం సాధించలేవు అన్నవారి చేత శెభాష్ అనిపించుకుంది. ఆమె నాసిక్‌లోని మాటోరి గ్రామానికి చెందిన సంగీత పింగలే అనే మహిళా రైతు.

సంగీత రెండో కుమారుడు 2004లో జనన సమస్యల వలన మరణించాడు. ఈ విషాదం నుంచి తేరుకోక ముందే 2007 లో సంగీత భర్త ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. భర్త మరణించే నాటికీ సంగీత 9 నెలల గర్భవతి. సంగీత కష్టాన్ని అత్తమామలు అర్ధం చేసుకున్నారు. పదేళ్ళపాటు అండగా నిలిచారు. అయితే 2017లో కుటుంబ కలహాల కారణంగా ఉమ్మడి కుటుంబం విడిపోవడంతో సంగీత తన అత్తమామలు, పిల్లలతో కలిసి వేరేగా జీవించడం ప్రారంభించింది. ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయిన రెండు నెలల తర్వాత సంగీత మామగారు అనారోగ్యంతో మరణించారు. కుటుంబంలో విషాదం నెలకొంది. సంగీత జీవితం కొత్త మలుపు తిరిగింది. కుటుంబం గడవాలంటే.. తప్పని సరిగా పనిచేయాల్సి వచ్చింది. సైన్స్ లో డిగ్రీ పట్టాపుచ్చుకున్న సంగీత మామగారు ఇచ్చిన 13 ఎకరాల పొలంలో వ్యవసాయం మొదలు పెట్టింది.

మాటలు చెప్పడం ఈజీ.. వ్యవసాయం చేయడం కష్టం అంటూ రకరకాలుగా కామెంట్స్ చేశారు. అయితే సంగీత ఎవరి మాటా వినలేదు పనిపైనే దృష్టి పెట్టింది. ఆధునిక వ్యవసాయ పద్దతులను అనుసరించి ద్రాక్ష, టమోటాల మంచి దిగుబడి సాధించి.. లక్షల ఆదాయాన్ని పొందుతుంది. మోటార్ సైకిల్, ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. సంవత్సరానికి 800 నుంచి 1,000 టన్నుల ద్రాక్షను ఉత్పత్తి చేస్తూ ఏడాదికి 25-30 లక్షలు సంపాదిస్తోంది. కాగా ఆమె ద్రాక్ష పంటను ఎగుమతిచేసే దిశగా ఆలోచన చేస్తోంది. వ్యవసాయం తనకు పట్టుదల, సహనాన్ని నేర్పిందని సంగీత చెబుతోంది.

మరిన్ని చదవండి ఇక్కడ: Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Hebah Patel: ఏంజెల్ లా మెరుస్తున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)