Dog on Owner: యజమానిపై శునకం రివెంజ్‌.. శునకాన్ని స్కూటీకి కట్టేసిన యజమాని.. ఆతర్వాత..?

|

Apr 30, 2023 | 9:45 AM

ఈ వీడియోలో ఓ పెంపుడు కుక్క స్కూటీకి కట్టేసి ఉంది. చూడ్డానికి పార్కింగ్ ఏరియాలాగా ఉన్న ఆ ప్రాంతంలో తన పెంపుడు కుక్కను స్కూటీకి కట్టేసి అతను ఎక్కడికో వెళ్లినట్లున్నారు. తనను వదిలేసి వెళ్లడంతో ఆ కుక్కకు తిక్కరేగి తన ఓనర్ స్కూటీ సీట్‌ని కాలి గోర్లతో చించేసింది.

నిత్యం సోషల్ మీడియాలో పెంపుడు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అవి చేసే చిలిపి పనులను వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేస్తుంటారు వాటి యజమానులు. ఓ వ్యక్తిపై తన పెంపుడు కుక్క రివెంజ్‌ తీర్చుకున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ పెంపుడు కుక్క చేసిన పనికి నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు.ఈ వీడియోలో ఓ పెంపుడు కుక్క స్కూటీకి కట్టేసి ఉంది. చూడ్డానికి పార్కింగ్ ఏరియాలాగా ఉన్న ఆ ప్రాంతంలో తన పెంపుడు కుక్కను స్కూటీకి కట్టేసి అతను ఎక్కడికో వెళ్లినట్లున్నారు. తనను వదిలేసి వెళ్లడంతో ఆ కుక్కకు తిక్కరేగి తన ఓనర్ స్కూటీ సీట్‌ని కాలి గోర్లతో చించేసింది. నోటితో ముక్కలు ముక్కలుగా పీకి పడేసింది. అక్కడే ఉన్న ఎవరో ఓ వ్యక్తి ఆకుక్క చేస్తున్న పనిని వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను ఇప్పటికే 15 లక్షలమందికి పైగా వీక్షించారు. 28 వేలమంది లైక్‌ చేశారు. వీడియోను చూసిన నెటజన్లు పిచ్చపిచ్చగా నవ్వేసుకుంటున్నారు. వీరిలో ఓ నెటిజన్ ‘పాపం ఆ పెంపుడు కుక్క.. దాని ఓనర్ కోసం ఎదురు చూసి చూసి విసిగెత్తిపోయింది’ అంటూ సరదా కామెంట్ చేశాడు. ‘స్మార్ట్ రివెంజ్.. ఇలా చేస్తేనే ఓనర్స్ తమ పెంపుడు కుక్కలను కట్టేయకుండా ఉంటారు’ అని రాసుకొచ్చాడు మరో నెటిజన్. అంతేకాదు వీడియోను తమ సన్నిహితులకు కూడా షేర్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: Apr 30, 2023 09:45 AM