Viral Video: నాగుపాముకి సర్జరీ చేసిన వైద్యులు.. ఎందుకో తెలుసా..?
ప్లాస్టిక్ డబ్బాను మింగేసిన నాగుపాముకు ఆపరేషన్ చేసి దాని ప్రాణాలు కాపాడారు ఓ పశు వైద్యుడు. కర్ణాటక మంగళూరులో బంట్వాళ సమీపంలోని సాలుమరాడ తిమ్మక్క పార్కు సమీపంలోని గుంతలో ఓ నాగు పాము గాయాలతో కనిపించింది.
ప్లాస్టిక్ డబ్బాను మింగేసిన నాగుపాముకు ఆపరేషన్ చేసి దాని ప్రాణాలు కాపాడారు ఓ పశు వైద్యుడు. కర్ణాటక మంగళూరులో బంట్వాళ సమీపంలోని సాలుమరాడ తిమ్మక్క పార్కు సమీపంలోని గుంతలో ఓ నాగు పాము గాయాలతో కనిపించింది. ఈ పామును కమలపాడు గ్రామపంచాయితీ సభ్యురాలు వసంతి గమనించింది. తన కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసి, పశు వైద్యుడు స్నేక్ కిరణ్‌కు సమాచారం అందించారు. వెంటనే కిరణ్ ఘటనాస్థలికి చేరుకుని పాముకు చికిత్స అందిచాడు. తల కింది భాగంలో గాయాలైనట్లు గుర్తించిన అతను.. మంగళూరు వెటర్నరీ ఆసుపత్రి పశు వైద్యాధికారి డా యశస్వి నారవి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు పాము కడుపు ఉబ్బి ఉండడాన్ని గమనించి ఎక్స్‌రే తీశారు. పాము కడుపులో ప్లాస్టిక్ పదార్ధం ఉండటాన్ని గమనించారు. వెంటనే నాగుపాముకు సర్జరీ చేసి, దాని కడుపులోని ప్లాస్టిక్ డబ్బాను తొలగించారు. శస్త్ర చికిత్స అనంతరం 15 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. పాము కోలుకున్నాక ఫారెస్ట్ అధికారుల సూచనతో అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు స్నేక్ కిరణ్వెల్లడించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..