Case on hen: ఇదేం విడ్డురం అయ్యా.. కోడి కూసి విసిగిస్తోందని కేసు పెట్టిన వైద్యుడు..! వైరల్ వీడియో.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కోడి కూసిందని చెప్పి ఓ వైద్యుడు ఏకంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వినేందుకు వింతగా ఉన్నా ఇది నిజం.
అలోక్ మోడీ అనే క్యాన్సర్ వైద్యుడు రోజంతా డ్యూటీ ఆపరేషన్ల కారణంగా అర్ధరాత్రి సమయంలో ఇంటికి వస్తుంటాడు. ఉదయం వరకు నిద్రలేవడు. అయితే, తన ఇంటి సమీపంలో ఉన్న వందన విజయన్ అనే వ్యక్తికి చెందిన ఓ కోడి మాత్రం రోజూ తెల్లవారుజామునే కూస్తూ మోడీ నిద్రకు భంగం కలిగించేది. ఈ విషయమై అతను విజయన్‌తో పలుమార్లు చెప్పాడు. కోడిని బోనులో ఉంచమని సలహా కూడా ఇచ్చాడు. అయితే అది సాధ్యం కాలేదు. దీంతో విసుగుచెందిన మోడీ.. చేసేదేంలేక పాలసియా పోలీసులను ఆశ్రయించాడు. కోడి కూస్తూ తన నిద్రకు భంగం కలిగిస్తోందని ఫిర్యాదు చేశాడు.రోజంతా ఆసుపత్రిలో బిజీగా ఉండి.. అలసిపోయి రాత్రి ఇంటికొచ్చి పడుకుంటున్నానని.. అయితే, తన ఇంటి సమీపంలో ఉన్న వందన విజయన్‌కు చెందిన కోడి రోజూ తెల్లవారుజామున 4-5 గంటల మధ్య కూస్తూ నిద్రకు భంగం కలిగిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వందన విజయన్‌పై సెక్షన్ 138 కింద కేసు నమోదు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..