Viral Video: కొత్త పెళ్ళికూతురిని మిలటరీ హెలికాప్టర్‌లో తీసుకెళ్లిన కమాండర్‌..! ఎందుకో తెలియకుండా కోపడ్డ నెటిజన్లు..

|

Jul 10, 2022 | 9:55 AM

తాలిబన్‌ కమాండర్‌ నవ వధువుని ఇంటికి తీసుకెళ్లేందుకు మిలటరీ హెలికాప్టర్‌ని ఉపయోగించారంటూ ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి.


తాలిబన్‌ కమాండర్‌ నవ వధువుని ఇంటికి తీసుకెళ్లేందుకు మిలటరీ హెలికాప్టర్‌ని ఉపయోగించారంటూ ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. మీడియా కథనం ప్రకారం… హక్కాని శాఖ కమాండర్‌ నవ వధువుని తీసుకుని మిలటరీ చాపర్‌లో అప్గనిస్తాన్‌లోని లోగర్‌ నుంచి ఖోస్ట్‌ ప్రావిన్స్‌ వెళ్లినట్లు తెలిపింది. కమాండర్‌ నవవధువు ఇంటి దగ్గర హెలికాప్టర్‌ నుంచి దిగుతున్న వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆ వ్యక్తి ఆమెని వివాహం చేసుకునేందుకు తన మామగారికి దాదాపు 10 లక్షల రూపాయలు చెల్లించాడని వెల్లడించింది. అయితే ఈ విషయంపై తాలిబన్‌ డిప్యూటి అధికార ప్రతినిధి యూసుఫ్‌ అహ్మదీ స్పందిస్తూ… ఆ వ్యాఖ్యలను ఖండించారు. శత్రువులు చేస్తున్న తప్పుడూ ప్రచారంగా పేర్కొన్నారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ప్రజలు ఈ చర్యను ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. ఇది ప్రజా ఆస్తులను దుర్వినియోగపరచడం కిందకే వస్తుందంటూ పెద్ద ఎత్తున మండిపడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 10, 2022 09:55 AM