Rhino Accident: ఖడ్గ మృగాన్ని ఢీకొట్టిన లారీ.. తరువాత ఎం జరిగిందంటే..? షాకింగ్ వీడియో షేర్ చేసిన సీఎం.!
రోడ్డుపైకి వస్తున్న ఖడ్గ మృగాన్ని వేగంగా వస్తున్న ఓ లారీ ఢీకొట్టడంతో రైనో కింద పడిపోగా.. లారీ అలాగే వేగంగా ముందుకు వెళ్లిపోయింది. అనంతరం..
అది అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్.. దట్టమైన అడవి మధ్యలో ఓ రహదారి. అయితే అప్పుడే రోడ్డుపైకి వస్తున్న ఖడ్గ మృగాన్ని వేగంగా వస్తున్న ఓ లారీ ఢీకొట్టడంతో రైనో కింద పడిపోగా.. లారీ అలాగే వేగంగా ముందుకు వెళ్లిపోయింది. అనంతరం ఖడ్గ మృగం పైకి లేచి నడవబోతుండగా మరోసారి కింద పడి ఆ తర్వాత లేచి అడవిలోకి పరుగు తీసింది రైనో. అయితే ఈ వీడియోను అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. రైనోల మా ప్రత్యేక స్నేహితులని పేర్కొన్నారు. జంతువులకు హానీ కలిగించే చర్యలను ఉపేక్షించబోమని సీఎం హెచ్చరించారు. ఆ లారీ డ్రైవర్‌కు జరిమానా విధించినట్లు తెలిపారు. జంతువులను కాపాడేందుకు కజిరంగా నేషనల్ పార్కు సంబంధించిన 32 కిలోమీటర్ల కారిడార్‌ను నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
