Heart touching: తొలిసారి తల్లి స్వరం విన్న చిన్నారి.. హృదయాలను కదిలిస్తున్న వీడియో..

Updated on: Apr 15, 2022 | 8:56 PM

కొంత మంది పిల్లలు పుట్టుకతోనే కొన్ని లోపాలతో పుడతారు. అటువంటి వారిలో కొందరికి వినే, చూసే సామర్థ్యం కూడా ఆస్సలుండదు. అయితే ఆ పసిపిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో? వాళ్లకు ఏమౌతుందో ఎదుటివారికి అర్థం కాదు. అంత చిన్న బిడ్డలు నోరు తెరిచి చెప్పలేరు.


కొంత మంది పిల్లలు పుట్టుకతోనే కొన్ని లోపాలతో పుడతారు. అటువంటి వారిలో కొందరికి వినే, చూసే సామర్థ్యం కూడా ఆస్సలుండదు. అయితే ఆ పసిపిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో? వాళ్లకు ఏమౌతుందో ఎదుటివారికి అర్థం కాదు. అంత చిన్న బిడ్డలు నోరు తెరిచి చెప్పలేరు. ఇక వారి పరిస్థితి తలచుకుంటేనే గుండె బరువెక్కుతుంది కదా? ఐతే ఇటువంటి వారికి దేవుడు వరం ఇచ్చినట్లు హఠాత్తుగా వినిపించడం ప్రారంభమైతే.. ఊహ బాగానే ఉంది కానీ నిజంగా ఇలలో ఇది సాధ్యమౌతుందా? అనే కదా అనుకుంటున్నారు. కానీ ఇది నిజమైంది.జాక్ అనే పాప పరిస్థితి కూడా సరిగ్గా ఈ విధమైనదే. ఐతే ఈ చిన్నారి తొలిసారిగా వినడం ప్రారంభినప్పుడు.. పాప ఎక్స్‌ప్రెషన్‌ చూస్తే ఖచ్చితంగా భావోధ్వేగానికి గురవుతారు. ఈ పాపకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. బోన్‌ యాంకర్డ్‌ హియరింగ్‌ ఎయిడ్‌ అనే వినికిడి పరికరంతోనే ఇది సాధ్యపడింది. ఇది తాత్కాలిక పరిష్కారమైనప్పటికీ పాపకు వినికిడి తెప్పించడానికి డాక్టర్లు ఈ పద్ధతిని ఎంచుకున్నారు. ఈ వీడియోలో ఒక మహిళ చేతుల్లో ఉన్న జాక్‌ పాప తలకు వినికిడి పరికరాన్ని డాక్టర్లు అమర్చారు. మహిళ మాట్లాడుతున్నప్పుడు.. స్వరం వినిపించిన వైపుకు తలను తిప్పుతూ ప్రతిస్పందించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఆనందంగా ఆ చిన్నారి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.

మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నా

Loading...
Unable to load recommendations.
Follow Us