Bird fight with snake: పిల్లలను రక్షించుకునేందుకు పాముతో తలపడ్డ వడ్రంగి పిట్ట.. చివరికేమైందంటే..?
కన్న బిడ్డలు కష్టంలో ఉంటే తల్లి గుండె తల్లడిల్లుతుంది. తన పిల్లలను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది. అందుకే బిడ్డలపై ప్రేమ చూపించడంలో అమ్మను మించినవారెవరూ ఉండరు.
కన్న బిడ్డలు కష్టంలో ఉంటే తల్లి గుండె తల్లడిల్లుతుంది. తన పిల్లలను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది. అందుకే బిడ్డలపై ప్రేమ చూపించడంలో అమ్మను మించినవారెవరూ ఉండరు. ఇది మనుషులకే కాదు పశుపక్ష్యాదులకూ వర్తిస్తుంది. అందుకు ఉదాహరణే ఈ షాకింగ్ వీడియో.నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వడ్రంగి పిట్ట తన పిల్లలను పాము బారినుంచి కాపాడుకోవడానికి పెద్ద పోరాటమే చేసింది. పాములు పక్షుల గూళ్లలోకి చేరి వాటి పిల్లలను తినేస్తూ ఉంటాయి. ఈ వీడియోలో కూడా ఓ విషసర్పం వడ్రంగి పిట్ట పిల్లలను తినడానికి చెట్టుపైకి వెళ్లింది. అక్కడ గూళ్లలో దాగున్న పిల్లలను తినేందుకు ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన తల్లి పక్షి.. ఆ పామును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో తన ముక్కుతో గుచ్చుతూ పామును గాయపరుస్తుంది. వెంటవెంటనే దాడికి పాల్పడి పామును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పాము కూడా ఆ పక్షిని పట్టుకోవడానికి విఫలయత్నం చేస్తుంది. అయితే పాము నోటికి చిక్కినట్లే చిక్కి వడ్రంగి పిట్ట తప్పించుకుంటుంది. ఇక చివరకు అలసిపోయిన పాము అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరలవుతోంది. దీనికి నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ‘ఈ ప్రపంచంలో అమ్మను మించిన పోరాటయోధులెవరూ లేరు’, ‘అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది. పాముకు తగిన బుద్ధి చెప్పింది’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
Bus Shelter – Buffalo: బస్ షెల్టర్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..