James Cameron: టైటానిక్ మునిగిన ప్రాంతం అత్యంత భయానకం.. జేమ్స్‌ కామెరాన్‌ .

|

Jun 27, 2023 | 8:07 AM

టైటన్ సబ్మెర్సిబుల్ కథ విషాదాంతమైంది. తీవ్రమైన పీడనం వల్ల టైటన్‌ పేలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్‌గార్డ్‌ ప్రకటించింది. రిమోట్‌ కంట్రోల్డ్‌ వెహికల్‌ సాయంతో శకలాలను గుర్తించామని తెలిపింది. ఈ క్రమంలో...

టైటన్ సబ్మెర్సిబుల్ కథ విషాదాంతమైంది. తీవ్రమైన పీడనం వల్ల టైటన్‌ పేలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్‌గార్డ్‌ ప్రకటించింది. రిమోట్‌ కంట్రోల్డ్‌ వెహికల్‌ సాయంతో శకలాలను గుర్తించామని తెలిపింది. ఈ క్రమంలో టైటానిక్‌ మునిగిపోయిన ప్రాంతాన్ని అనేకసార్లు సందర్శించిన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్‌ కామెరాన్‌ గతంలో తన అనుభూతిని పంచుకున్నారు. జేమ్స్‌ కామెరాన్‌ పరిచయం అక్కర్లేని పేరు. టైటానిక్, అవతార్‌, అవతార్2 సహా ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించారు. 13వేల అడుగుల లోతున ఉన్న టైటానిక్ చరిత్రను డాక్యుమెంటరీ రూపంలోనూ తీసుకొచ్చారు. సాహసాలంటే ఇష్టపడే కామెరూన్‌ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్‌ షిప్‌ ప్రాంతాన్ని ఇప్పటివరకూ 33 సార్లు సందర్శించారు.

‘‘ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో టైటానిక్ మునిగిన ప్రాంతం ఒకటి అంటూనే మనుషులు ఎప్పుడూ చూడని ప్రదేశాలను చూడడం తనకు ఎంతో ఇష్టమని అందుకే ఆ ప్రాంతానికి వెళ్లా”నని చెప్పారు. టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని చూడాలన్న కోరికతోనే మూవీని తెరకెక్కించానని ఆ కారణంతోనే సబ్‌మెరైన్‌లో సముద్ర గర్భంలో ప్రయాణించానని తెలిపారు. అంతేకానీ ప్రత్యేకంగా దాన్నొక సినిమాగా తీయాలన్న ఉద్దేశం తనకు లేదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతి పెద్ద ఓడ ప్రమాదాల్లో టైటానిక్‌ ఎవరెస్ట్‌లాంటిది అని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..

Follow us on