Step well: వావ్.. మీ కళ్ళను మీరే నమ్మలేరు.. ఔరా అనిపిస్తున్న 300 ఏళ్ల నాటి నాగన్న కుంట మెట్ల బావి..

Updated on: Dec 11, 2022 | 8:59 AM

హైదరాబాద్‌లో మరో టూరిస్ట్‌ స్పాట్‌ రెడీ అయింది. నగరం నడిబొడ్డును మరో పర్యాటక కేంద్రంగా టూరిస్టుల మన్ననలను పొందనుంది.


300 ఏళ్ల నాటి నాగన్న కుంట బావి పునరుజ్జీవంతో ఔరా అనిపిస్తుంది. బన్సీలాల్‌పేటలోని అత్యంత పురాతనమైన మెట్ల బావి రూపు రేఖలు మారిపోయాయి. పూర్తిగా మరుగున పడిపోయిన శతాబ్ధాల చరిత్ర కలిగిన మెట్ల బావి రీస్టోరేషన్ పనులను పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసుకుంది. ఇక్కడ ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్‌, యాంపీ థియేటర్‌ని ఏర్పాటు చేసింది. చారిత్రక కట్టడాల పునరుద్దరణలో భాగంగా ఎన్జీవోతో కలిసి హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఈ మెట్ల బావికి తిరిగి ప్రాణం పోశాయి. 500 టన్నులకు పైగా 800 ట్రక్కుల చెత్తను బావి నుంచి వెలికి తీశారు. అందంగా ఆనాటి రూపాలను తీర్చిదిద్ధడమే కాదు.. చిన్న, చిన్న వేడుకల కోసం సీటింగ్‌తో కూడిన గార్డెన్‌, యాంపీ థియేటర్‌ నిర్మాణం చేసి అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మలిచారు. మెట్ల బావుల సంరక్షణలో డెఫినెట్ గా ట్రెండ్ సెట్టర్ గా బన్సీలాల్ పేట్ మెట్ల బావి నిలుస్తుందని అధికారులు బావిస్తున్నారు. మరుగునపడ్డ బావిని గుర్తించారు ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పనా రమేశ్. భూగర్భ జలాల సంరక్షణ కోసం కృషి చేస్తున్న ఈమె.. ఇప్పటికే నగరంలో పలు మెట్ల బావుల పునరుద్ధరణలో భాగస్వామిగా ఉన్నారు. అదే కోవలో ఆమె కంటికి బన్సీలాల్ పేట్ బావి చిక్కింది. అయితే చెత్త చెదారంతో చిక్కుకున్నఈ బావి.. ఇంత పెద్ద ఎత్తున ఉంటుందని ఊహించలేదంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 11, 2022 08:59 AM