ఫ్లైఓవర్‌పై దూసుకెళ్తున్న కారు.. డ్రైవర్‌కు గుండెపోటు.. సీసీ ఫుటేజ్‌ వీడియో

Updated on: Nov 23, 2025 | 1:50 PM

మహారాష్ట్ర లోని థానే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో కారు డ్రైవర్‌ సహా నలుగురు మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఠాణె జిల్లా అంబర్ నాథ్ ప్లైఓవర్ పై శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. శివసేన పార్టీ నేత కిరణ్‌ చాబే ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తున్నారు. కారులో వెళుతుండగా డ్రైవర్ లక్ష్మణ్ షిండే గుండెపోటుకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆయన అంబర్ నాథ్ ప్లైఓవర్ మీదుగా వెళ్తుండగా డ్రైవర్‌ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా గుండెనొప్పి రావడంతో ఆయన కారును హ్యాండిల్‌ చేయలేకపోయారు. దీంతో కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్‌లు, ఇతర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ఢీకొట్టిన వేగానికి ఓ బైకర్ ఎగిరి ఫ్లైఓవర్‌ కింద పడ్డాడు. కారు డ్రైవర్ షిండేతో పాటు మరో ముగ్గురు వాహనదారులు మరణించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కిరణ్ చాబె ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో

ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో

బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో