నడిరోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. ఎందుకో తెలుసా!వీడియో

Updated on: Sep 07, 2025 | 2:58 PM

సాధారణంగా మహిళలు మంచి నీళ్ళ ట్యాంకుల దగ్గర నీళ్ళ కోసం బిందెలతో కొట్టుకోవడం, ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం జుట్టు పట్టుకోవడం మనం చూశాం. ఇప్పుడు మరో కారణంతో మహిళలు సిగపట్లకు రెడీ అయ్యారు. తెలంగాణలో కొంతకాలంగా యూరియా కోసం నిరీక్షిస్తున్న మహిళలు ఈసారి దాన్ని దక్కించుకునే క్రమంలో కొట్టుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఉత్తర తెలంగాణ జిల్లాలో యూరియా కొరత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. కాగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం రైతులు గ్రోమోర్ సెంటర్ పై రాళ్ళ దాడికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా నిప్పు పెట్టారు. ఆ సంఘటన మరవక ముందే శుక్రవారం మరో ఘటన జరిగింది. యూరియా విక్రయ కేంద్రం వద్ద ఇద్దరు మహిళలు రైతులు సిగలు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకున్నారు. జిల్లాలోని వివేకానంద సెంటర్ లో ఆగ్రోస్ కేంద్రం వద్ద యూరియా బస్తాల కోసం తెల్లవారు జామునుండే ఆధార్ కార్డుల జిరాక్సులు పట్టుకొని వందలాది మంది రైతులు, మహిళలు, బారులు తీరారు. ఈ క్రమంలో ఒకరికొకరు నెట్టుకోవడంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. దీంతో క్యూలో నిలబడిన ఇద్దరు మహిళారైతులు వాగ్వాదానికి దిగారు. అది చినికి చినికి గాలివానలాగా మారి జుట్టు పట్టుకొని కొట్టుకునే వరకు వెళ్ళింది. అక్కడ వందలాది మంది ఉన్న వారిద్దరిలో ఎవరు తగ్గలేదు. ప్రధాన రహదారిపై పోరుతో కొట్టుకోవడంతో అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టారు. ఈ క్రమంలో కొందరు రైతులు వారిని వారించే ప్రయత్నం చేసినా వారు తగ్గలేదు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.