మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వాచ్‌మెన్‌

|

Mar 03, 2024 | 3:58 PM

ఏదైనా సాధించాలి అనే పట్టుదల, కృషి ఉండాలే కానీ సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అలాంటి ఎన్నో సంఘటనలు మనం చూశాం. తాజాగా ఓ యువకుడు తన పట్టుదల, కృషితో ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. మంచిర్యాల జిల్లా కు చెందిన ప్రవీణ్‌ జన్నారంలో డిగ్రీ వరకూ చదువుకున్నాడు. ఎంకాం, బీఈడీ, ఎంఈడీ ఓయూ క్యాంపస్‌లోనే చదువుకొన్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఉస్మానియాలో ఎంకామ్, బీఈడీ, ఎంఈడీ పూర్తి చేశాడు.

ఏదైనా సాధించాలి అనే పట్టుదల, కృషి ఉండాలే కానీ సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అలాంటి ఎన్నో సంఘటనలు మనం చూశాం. తాజాగా ఓ యువకుడు తన పట్టుదల, కృషితో ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. మంచిర్యాల జిల్లా కు చెందిన ప్రవీణ్‌ జన్నారంలో డిగ్రీ వరకూ చదువుకున్నాడు. ఎంకాం, బీఈడీ, ఎంఈడీ ఓయూ క్యాంపస్‌లోనే చదువుకొన్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఉస్మానియాలో ఎంకామ్, బీఈడీ, ఎంఈడీ పూర్తి చేశాడు. ప్రవీణ్‌ తండ్రి మేస్త్రీ పనిచేస్తుండగా, తల్లి బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ ప్రవీణ్‌ను డిగ్రీ వరకూ చదివించారు. అనంతరం పట్టుదలతో ప్రవీణ్‌ వాచ్‌మెన్‌గా పనిచేసుకుంటూ పై చదువులు అభ్యసించి లక్ష్యాన్ని సాధించాడు. ప్రవీణ్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రీసెర్చ్ సెంటర్ లో రాత్రిపూట వాచ్‌మన్‌గా చేరాడు. ఐదేళ్లుగా వాచ్‌మన్‌గా ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ పిల్లలకు జ్వరం వస్తే అశ్రద్ధ చేయకండి.. అది స్కార్లెట్‌ జ్వరం కావచ్చు

అర్హులైన అందరికీ 200 యూనిట్లవరకూ విద్యుత్‌ ఫ్రీ

Follow us on