తెలంగాణ అబ్బాయి, నేపాల్ అమ్మాయి.. పెళ్లితో ఒక్కటైన ప్రేమజంట
తెలంగాణకు చెందిన రాజేష్, నేపాల్ యువతి సుజితల ప్రేమకథ ఇది. విదేశాల్లో ఉద్యోగం చేస్తుండగా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కుటుంబాల వ్యతిరేకతను అధిగమించి, నల్గొండలో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. ప్రేమకు సరిహద్దులు, భాష, సంప్రదాయాలు అడ్డు కావని నిరూపించిన ఈ జంట, కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
ప్రేమకు సరిహద్దులు, భాష, సంప్రదాయాలు అడ్డు కావని నిరూపించింది ఓ జంట. నేపాల్ యువతితో ప్రేమలో పడ్డాడు తెలంగాణ కుర్రాడు. విదేశాల్లో ఉద్యోగం చేస్తుండగా వీరి మనసులు కలిసాయి. ఇండియా వచ్చి మూడుముళ్లతో ఒకటయ్యారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం బండపాలెం గ్రామానికి చెందిన బాచుపల్లి రాజేష్.. హైదరాబాద్ లో హోటల్ మేనేజ్మెంట్ చదివాడు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి ఓ సంస్థలో పని చేసాడు. అదే సమయంలో నేపాల్‌కు చెందిన సుజిత థాపా కూడా హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి రాజేష్ పనిచేస్తున్న సంస్థలోనే పనిచేసింది. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రాజేష్, సుజిత దుబాయ్‌లో నాలుగేళ్లు, ఆ తర్వాత కెనడాలో మూడేళ్ల కలిసి పనిచేశారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించడంతో ఇరు కుటుంబాల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. అయితే.. వీరిద్దరూ తమ కుటుంబ సభ్యులతో మాట్లాడి వివాహానికి ఒప్పించారు. తాజాగా నల్గొండ జిల్లా నకిరేకల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ ప్రేమ జంట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత స్థానిక వెంకటేశ్వర ఆలయంలో సంప్రదాయబద్ధంగా జరిగిన పెళ్లిలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన రాజేష్, సుజిత దంపతులకు అన్ని విధాలా మంచి జరగాలని బంధుమిత్రులు ఆశీర్వదించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫోర్బ్స్ కవర్ పేజీపై కోదాడ కుర్రాడు జానీ పాషా
Jr NTR: వెండితెర మీద 25 ఏళ్లు పూర్తి చేసుకున్న NTR
Arjun Kapoor: వరుస ఇబ్బందులతో డిప్రెషన్ లోకి వెళ్ళా.. ఇప్పుడు ఇలా..
భన్సాలీ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్.. హీరామండి
ఒకే సీజన్‌లో రానున్న మహేష్, అల్లు అర్జున్.. టాలీవుడ్ గ్లోబల్ వార్ పక్కా
