ఒకరితోనే వేగలేక చస్తుంటే.. నువ్వేంటి సామీ ఇద్దరిని..

Updated on: Apr 05, 2025 | 12:07 PM

ఇటీవల కాలంలో ఆడపిల్లల సంఖ్య తగ్గడంతో పెళ్లి చేసుకోడానికి అమ్మాయిలు దొరకడంలేదనే ప్రచారం ఉంది.. ఈ క్రమంలో కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటారు. కొందరు పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో రైతులు తమకు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడంలేదని ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఘటనలూ మనం చూశాం.

తాజాగా ఓ రైతు ఇద్దరు యువతులను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ఒకే ముహూర్తానికి ఒకే మండపంలో ఒకేసారి పెళ్లి చేసుకొని సంచలనం సృష్టించాడు. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఒక్కరికే దిక్కులేదంటే.. నువ్వేంటి సామీ ఇద్దర్ని చేసుకున్నావ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన కొమురం భీం జిల్లాలో జరిగింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గుమ్నూర్ కు చెందిన సూర్యదేవ్ అనే యువ రైతు.. లాల్దేవి, జలకర్ దేవి అనే ఇద్దరు యువతులను ప్రేమించాడు. ప్రేమించిన ఆ ఇద్దరి యువతులను పెళ్లి చేసుకుంటానంటూ ఒప్పించాడు. అంతేకాదు పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశాడు. శుభలేఖలు వేయించాడు. శుభలేఖలో ఇద్దరు వధువుల పేర్లు, ఇద్దరిని పెళ్లాడే ఏకైక వరుడిగా యువకుడి పేరు ముద్రించాడు. గ్రామస్తులందరితోపాటు, తన బంధుమిత్రులందరినీ వివాహానికి ఆహ్వానించాడు. దాదాపు వెయ్యిమందికి భోజనాలు ఏర్పాటు చేశాడు. అతిధులందరి సమక్షంలో ఘనంగా ఇరువురు భామల మెడలో తలో తాళీ కట్టాడు. అంతేకాదు.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇద్దరినీ సమంగా సంతోషంగా చూసుకుంటానని బాండ్‌ పేపర్‌ కూడా రాసిచ్చాడు ఈ అభినవ ప్రేమికుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటిముందు ఏర్పడిన భారీ గుంత.. ఏంటా అని పరిశీలించగా.. బయటపడిన ఆలయం