తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు

Updated on: Jan 27, 2026 | 9:35 AM

తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో చిరుత దాడికి గురైన లేగదూడను చూసి తల్లి ఆవు కన్నీరుమున్నీరుగా విలపించిన హృదయవిదారక ఘటన ఇది. అడవిలో మరణించిన తన బిడ్డను వదలలేక, యజమానిని అక్కడికి తీసుకెళ్లింది. ఈ సంఘటన మనుషులకే కాదు, జంతువులకు కూడా మాతృప్రేమ ఎంత గొప్పదో నిరూపించింది. ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది.

ప్రపంచంలో తల్లి ప్రేమ వెలకట్టలేనిది. ఓ తల్లి ఆవు దూడను చూసి కంట కన్నీరు కార్చిన తీరు చూపరులను కంట తడి పెట్టించింది. చిరుతపులి దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన తన బిడ్డను చూసి ఆ గోమాత తల్లడిల్లిపోయింది. తెలంగాణ సిరిసిల్ల జిల్లా అడవుల్లో చిరుత సంచారం గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎర్రగడ్డ తండాలో చిరుతపులి దాడిలో లేగదూడ మృతి చెందింది. తల్లి గోమాత తన బిడ్డను విడిచిపెట్టలేక కంటతడి పెడుతున్న తీరు అక్కడి వారిని కలచివేసింది. అడవిలో జరిగిన ఈ ఘటన మాతృత్వం గొప్పతనాన్ని మరోసారి గుర్తుచేసింది. బానోతు రాజుకు చెందిన లేగదూడ ఇతర పశువులతో కలిసి అడవిలో మేతకు వెళ్లింది. అయితే చిరుత దాడిలో లేగదూడ అక్కడికక్కడే మృతి చెందింది. కొంతసేపటి తర్వాత అడవిలో ఒంటరిగా పడి ఉన్న లేగదూడ కళేబరాన్ని గుర్తించిన గోమాత తన కన్నబిడ్డను చూసి కన్నీరు కార్చుతూ తల్లడిల్లింది. తల్లి ప్రేమను స్పష్టంగా తెలియజేసేలా గోమాత అక్కడే ఆగకుండా ఇంటికి చేరుకుని యజమాని బానోతు రాజు చుట్టూ తచ్చాడుతూ అతడిని తిరిగి అడవిలోకి తీసుకెళ్లింది. అక్కడ మృతిచెందిన లేగదూడను చూసిన వెంటనే యజమాని కన్నీరుపెట్టుకుంటూ అటవీ అధికారులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు పరిశీలన చేపట్టే సమయంలో గోమాత కొద్దిసేపు వారికి దగ్గరికి రానివ్వలేదు. తన బిడ్డ కళేబరాన్ని ముద్దాడుతూ, కంటతడి పెడుతూ అక్కడే నిలిచిపోయింది. బిడ్డను వదలలేక లేగదూడ కళేబరం చుట్టూ తిరుగుతూ విలపించిన తీరు చూసినవారి హృదయాలను కదిలించింది. ఈ ఘటనతో కన్నపేగు బంధం మనుషులకే కాదు, జంతువులకూ అంతే బలంగా ఉంటుందనే విషయం మరోసారి స్పష్టమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bangladesh: మొండికేసిన బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్! వరల్డ్ కప్ నుంచి అవుట్

కేదార్‌నాథ్, బదరీనాథ్ ప్యానల్ కీలక నిర్ణయం

తెలంగాణ భవన్ లో స్పెషల్ స్కిట్.. ఆయన పాత్ర చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే

Khammam: నేను చస్తే మీకు హ్యాపీనా? బోరున ఏడ్చేసిన గవర్నమెంట్ టీచర్ గౌతమి

Garimella Balakrishna Prasad: మరణానంతరం గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారం